పవన్ టూర్ వివరాలను ప్రకటించిన జనసేన

Updated By ManamSun, 01/21/2018 - 19:42
janasena

pawankహైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న సాక్షిగా తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రేపటి యాత్రకు సంబంధించి షెడ్యూల్‌ను జనసేన ప్రకటించింది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ జగిత్యాల జిల్లా కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 9గంటలకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టుకు పవన్ బయల్దేరతారు. మధ్యాహ్నం 3గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. అక్కడి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు. అక్కడే తన యాత్ర ప్రణాళికను వివరిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం కరీంనగర్‌కు పవన్ వెళతారు. 23న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. 23వ తేదీ సాయంత్రం సుమారుగా 6.30కు ఖమ్మం జిల్లా కొత్తగూడెం చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 9.30గంటలకు పవన్ కొత్తగూడెం నుంచి భారీ ప్రదర్శనగా బయల్దేరి ఖమ్మం వెళతారు. అదేరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. అక్కడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

janasena

English Title
jansena president pawan kalyan telangana tour details
Related News