కేక పుట్టిస్తున్న జెన్నీఫర్ లోపెజ్

Updated By ManamThu, 11/01/2018 - 16:44
Jennifer Lopez wore just a cape for a photoshoot
ennifer Lopez wore just a cape for a photoshoot

ప్రముఖ పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ పుట్టిస్తోంది. ‘ఇన్‌స్టైల్’ మ్యాగజైన్‌ కవర్ పేజీ మీద జెన్నీఫర్ ఫోటో చూస్తే...వింటర్‌లోనూ బాడీ టెంపరేచర్ అమాంతం పెరిగిపోవాల్సిందే.  ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అభిమానులతో పాటు ఆ ఫోటో చూసినవారంతా వావ్ అంటూ నోరు తెరిచి చూడాల్సిందే. 

అభిమానులు ముద్దుగా జేలో ... ముదురు ఆకుపచ్చటి వాలెంటినో హాట్ కోచర్ ధరించిన ఫోటోలను చూస్తే మతి పోవాల్సిందే. ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను జెన్నీఫర్ తన ట్వీట్టర్‌లో వరుసగా షేర్ చేసింది. జేలో వయసు ప్రస్తుతం 49 ఏళ్లు. అయితే... ఆమెకు అంత వయసు ఉన్నట్లు కనిపించడం లేదని, ఇంకా యంగ్ లుక్‌లో మెరిసిపోతున్నారంటూ ఆమె అభిమానులు ట్వీట్ చేయడంతో పాటు, జెన్నీఫర్ ఫోటోలకు తెగ లైకులు కొడుతున్నారు. మీరు కూడా ఆ ఫోటోలు చూసి తరించండి మరి...

English Title
Jennifer Lopez wore just a cape for a photoshoot
Related News