జ్యోతిక ‘జిమ్మికి కమల్‌’

Updated By ManamFri, 08/03/2018 - 11:01
Jyothika

Jyothika మోహన్ లాల్ ‘వెలిపడింతే పుస్తకమ్’ చిత్రంలోని ‘జిమ్మికి కమల్’ పాట ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలకు అతీతంగా ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ పాటకు స్టెప్‌లు వేయనుంది జ్యోతిక.

హిందీలో ఘన విజయం సాధించిన ‘తుమ్హారీ సులు’ చిత్రం రీమేక్‌లో జ్యోతిక నటించనున్న విషయం తెలిసిందే. ‘కాట్రిన్ మొళి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జిమ్మికి కమిల్ పాటకు స్టెప్‌లు వేయనుంది జ్యోతిక. ఆ పాటలో జ్యోతికతో పాటు మంచు లక్ష్మి, కుమరవేల్, సిద్ధు శ్యామ్, ఆర్జే శాండ్రా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Jimmiki Kammal remix in Jyothika's movie
Related News