ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఇక పండగే పండగ!

Updated By ManamTue, 02/13/2018 - 18:09
airtel

rechargeపూలమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్టుగా తయారైంది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ పరిస్థితి. జియో రాకతో అప్పటివరకూ ఖరీదైన టారిఫ్‌లతో వినియోగదారులకు సేవలందించిన ఎయిర్‌టెల్ ఒక్కసారిగా దిగొచ్చింది. జియో చేసిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి పోటీ పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తోంది. అలా ఇప్పుడు తాజాగా 98రూపాయల సరికొత్త ప్లాన్‌ను జియోకు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ వినియోగదారులు 98రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 1జీబీ 4జీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28రోజులుగా తెలిపింది. అయితే వాయిస్ కాల్స్‌పై ఎయిర్‌టెల్ ఎయిర్‌టెల్ పరిమితి విధించింది. రోజుకు 250నిమిషాల పాటు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఆ పరిమితి దాటితే నిమిషాలకు 10పైసలు చెల్లించాల్సిందే. ఈ ప్యాక్‌ను జియో రిపబ్లిక్ డే సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన 98రూపాయల ప్యాక్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ చెబుతోంది.

English Title
Jio Effect: Airtel 93 Recharge Updated to Offer 28-Day Validity Just Like Jio's Rs. 98 Pack
Related News