‘మనం’ ఎడిటర్‌పై దాడి హేయం

Updated By ManamFri, 10/13/2017 - 12:03
A Petition to Sangareddy JC against the attack on Jaggareddy
  • జగ్గారెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలి

  • కేసు నమోదుచేసి, ఆయనను అరెస్టు చేయాలి

  • జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకూడదు

  • పాత్రికేయులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి

  • తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లా కలెక్టర్లకు వినతులు

మనం న్యూస్ నెట్‌వర్క్: ‘మనం’ దినపత్రిక సంపాదకులు రమేష్‌కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్‌లపై బుధవారం నాటి దాడి హేయమని తెలుగు రాష్ట్రాల్లోని పాత్రికేయులు ఖండించారు. దీనిపై తీవ్ర నిరసన తెలియుజేస్తూ గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిపై కేసు నమోదుచేసి శిక్షించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ డిమాండ్ చేశారు. ప్రకటనల బిల్లు చెల్లించాలని కొన్ని నెలలుగా కోరుతున్నా తాత్సారం చేస్తున్న ఆయన, డబ్బు చెల్లిస్తానంటూ పిలిపించి సంగారెడ్డిలోని ఒక దాబా వద్ద అనుచరులతో దాడి చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. జర్నలిస్టులపై దాడులను నివారించాలని, వారికి రక్షణ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఉపాధ్యక్షుడు వై.ప్రభాకర్ సంగారెడ్డిలో డిమాండ్ చేశారు. ఫెడరేషన్ జిల్లా కమిటీ, ఇతర జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడినవారిపై చట్టరీత్యా తగుచర్యలు తీసుకోవాలని, జగ్గారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నినదించారు.

జగ్గారెడ్డి అరాచకాలకు ఇది పరాకాష్ట
‘మనం’ ఎడిటర్ రమేష్, డైరెక్టర్ శ్రీనివాస్‌లపై జగ్గారెడ్డి దాడి చేయడం హేయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ఎస్‌ఎన్ టీవీ చైర్మన్ ఆర్.సత్యనారాయుణ అన్నారు. జగ్గారెడ్డి అరాచకాలకు ఇది పరాకాష్టగా అభివర్ణించారు. ఈ విషయాన్ని జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని ప్రకటించారు. జగ్గారెడ్డి తన తప్పు తెలుసుకుని ఇకైనెనా జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోైవెపు జగ్గారెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్‌కు టీయూడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు వినతి పత్రం ఇచ్చారు.

వరంగల్‌లో...Journalists petition to Warangal collector Amrapali to take action against Jaggareddy
‘మనం’ దినపత్రిక ఎడిటర్ రమేష్‌కుమార్‌పై జగ్గారెడ్డి దాడిని వరంగల్ అర్బన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అనంతరం ఐజేయూ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆమ్రపాలికి  వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు. జగ్గారెడ్డిసహా ఆయన అనుచరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, ‘మనం’ వరంగల్ బ్యూరో చీఫ్ ఎం.రజనీకాంత్, అర్బన్ ప్రతినిధి దామెర రాజేందర్, కంకణాల సంతోష్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం, ప్రజాసంఘాల ఖండన
‘మనం’ దినపత్రిక ఎడిటర్ వి.రమేష్‌కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్‌రావులపై జగ్గారెడ్డి దాడిని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. సీపీఎం అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, సీఐటీయూ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్, ఆల్‌షాపు వర్కర్స్ యూనియన్ నాయకుడు వేల్పుల సారంగపాణి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చొప్పరి రవికుమార్, టీఆర్‌ఎస్ నగర నాయకుడు కారు ఉపేందర్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. 

భూపాలపల్లిలో... 
‘మనం’ దినపత్రిక ఎడిటర్ రమేష్‌కుమార్‌పై దాడిని భూపాలపల్లి జిల్లాలోని పలువురు ప్రజాస్వామ్యవాదులు, పాత్రికేయ మిత్రులు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజాస్వామ్యం పదికాలాలు పరిఢవిల్లాలంటే రాజకీయాలనుంచి రౌడీయిజాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్నారు. దాడిని నిరసిస్తూ జగ్గారెడ్డిపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు విలేకరులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంతోపాటు మహదేవపూర్‌లో తహశీల్దార్‌కు, ములుగులో సబ్-కలెక్టర్‌కు  వినతిపత్రాలు అందజేశారు. జగ్గారెడ్డి తీరు అమానవీయమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని తెలుగుదేశం పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు 
గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జగ్గారెడ్డి హేయమైన చర్యకు పాల్పడ్డారని, ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయులపై దాడులు సమర్థనీయం కాదని బీజేపీ జిల్లాశాఖ అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్య అన్నారు.

ఎల్బీనగర్ చౌరస్తాలో...
జర్నలిస్టులపై జగ్గారెడ్డి దాడి నీచైమెన చర్య అని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు లామడియా శంకర్‌చౌహాన్ అన్నారు. దాడిని నిరసిస్తూ ఫోరం ఆధ్వర్యాన ఎల్బీనగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వీరమల్ల లింగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. అధికారులు ఆయనపై తక్షణం కేసు నమోదు చేయాలని కోరారు. పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని చామకూర రాజు వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని కంఠం సైదులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

నిజామాబాద్, కామారెడ్డిలలో...
ప్రకటనల డబ్బు చెల్లించాలని కోరితే దాడి చేయించడం దారుణమని  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పాత్రికేయుసంఘాలు, విలేకరులు, ప్రజా సంఘాలు త్రీవంగా ఖండించాయి. పత్రికా  స్వేచ్ఛను కాలరాస్తున్న జగ్గారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, తొలుత ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, సబ్-కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు.నిజామాబాద్ జిల్లా ‘మనం’ ప్రతినిధి చంటి ఆధ్వర్యంలో బోధన్‌లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జగ్గారెడ్డిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ఏవోకు వినతి పత్రం అందజేశారు.

నల్లగొండలో...
‘మనం’ ఎడిటర్ రవేుష్‌కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్‌లపై జగ్గారెడ్డి దాడి హేయమని నల్లగొండ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మారబోయిన మధుసూదన్ ఖండించారు. జగ్గారెడ్డిపై కేసు నమోదుచేసి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఖండించాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో...
జగ్గారెడ్డిని తక్షణం అరెస్టు చేయాలన్న డిమాండ్‌తో రెండు జిల్లాల్లోని వివిధ మండలాల్లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యాన ఆందోళన చేశారు. సీనియర్ జర్నలిస్టులపై దాడి అమానుషమని మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నాటి సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. విలేకరులపై దాడులు తగదని, అలాంటివారిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలిపారు.

Journalists giving petition to Kadapa AO కడప జిల్లాలో...
 ‘మనం’ ఎడిటర్‌పై జగ్గారెడ్డి దాడిని కడప జిల్లాలో పలువురు  నాయుకులు ఖండించారు. ఈ మేరకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర  నాయకుడు రామసుబ్బారెడ్డి, ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు  చంద్రమోహన్ రాజు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా నిరసించారు.  జగ్గారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని  వారు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి  జగ్గారెడ్డిని అరెస్టు చేయించి విలేకరులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అధికారికంగా కోరాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ‘మనం’ కడప జిల్లా బ్యూరో ఇన్‌చార్జి అల్లం రంగనాయకులు రాయల్ తదితరులు పాల్గొన్నారు.

English Title
Journalists across telugu states condemn the attack on MANAM Editor Ramesh and director Srinivas
Related News