రఫేల్‌పై జేపీసీ వేయాల్సిందే

Updated By ManamSat, 08/11/2018 - 01:03
sonia
  • పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యుల ఆందోళన

  • గాంధీ విగ్రహం ఎదుట సోనియా నేతృత్వంలో నిరసన

imageన్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాల సభ్యులు ఆందోళన నిర్వహించారు. కొనుగోళ్లపై  కేంద్ర ప్రభుత్వం నోరు విప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాజ్ బబ్బర్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అంబికా సోని, సీపీఐ నేత డి రాజా, ఆప్ ఎంపీ సుశీల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు వ్యవహారంపై పార్లమెంటరీ సంయుక్త సంఘం (జేపీసీ) ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. బోఫోర్స్ కుంభకోణం రఫేల్ వ్యవహారం పెద్దదని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి చేసిన ఆరోపణలను వారు ప్రస్తావిస్తూ..ఈ  అంశాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

కొనుగోలు ఒప్పందంపై కాగ్‌తో విచారణ జరిపించాలని శౌరి, సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.  కాగా. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. దాంతో సభ రెండు సార్లు వాయిదా పడాల్సి వచ్చింది. సభ ప్రారంభం కాగానే కొనుగోలు అంశంపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చశారు. సభ స్థానంలో తొలిసారి కూర్చున్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రతిపక్ష సభ్యులను సముదాయించేందుకు ఎంతగానే ప్రయత్నించినప్పటికీ.. వినలేదు. వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దాంతో జీరో అవర్‌కు ముందే సభ ఒకసారి వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. రఫేల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణమని, దానిపై జేపీసీ విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. 

 బీకేపై ప్రధాని వ్యాఖ్యల తొలగింపు
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభ్యం తర కర వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించినట్టు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు.  రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ పదవికి పోటీపడ్డ ప్రతిపక్ష నేత బీకే హరిప్ర సాద్‌పై మోదీ చేసిన వ్యాఖ్య లపై ప్రతిపక్షాలు చేసిన డిమాం డ్ నేపథ్యంలో చైర్మన్ ఈ నిర్ణ యం తీసుకున్నారు. కాగా పెద్దల సభహుందాత నం దిగజారేలా ప్రధాని వ్యాఖ్యలుండడం దురదృష్టమని హరిప్రసాద్ పేర్కొన్నారు. 

పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 18న ప్రారంభమైన సమావేశాలు 21 రోజుల పాటు కొనసాగాయి. 112 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది.  ఎస్సీ, ఎస్టీ చట్టంలో సవరణతోపాటు 21 బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. అలాగే.. సమావేశాల్లోనే టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై 51 మంది సభ్యులు 11.46 గంటలపాటు మాట్లాడారు.  ఈ తీర్మానం వీగిపోయింది. విపక్షాల నిరసనలు, అంతరాయాల కారణంగా సభ సమయంలో 8.26 గంటలు వృథా అయ్యింది. అయితే.. వివిధ అత్యవసర అంశాల కోసం సభ 21 గంటలపాటు అత్యధికంగా సమావేశమైంది. ఈసందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే వర్షాకాల సమావేశాలు పలఫ్రదంగా ముగిశాయని పేర్కొన్నారు. మరోవైపు, రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. 

English Title
JPC is on Rafael
Related News