ఆ విషయంలో అభయ్‌ని కాపాడలేం: ఎన్టీఆర్

Updated By ManamSat, 06/09/2018 - 17:26
jr NTR, son Abhay, Vennala Kishore, Social media, drinking milk

jr NTR, son Abhay, Vennala Kishore, Social media, drinking milk టాలీవుడ్ యువ హీరోలంతా అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియానే వేదికగా ఎంచుకున్నారు. అభిమానులతో ఎప్పటికప్పుడూ తమ కుటుంబ విషయాలను పంచుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అభిమాన హీరో కుటుంబ విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి.. సగటు అభిమాని కంటే వీరాభిమానులకే ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో అల్లుఅర్జున్, రామ్ చరణ్, ఉపాసన, సమంత ఇలా ప్రతిఒక్కరూ తమ సినిమా విషయాలను మాత్రమే కాకుండా తమ కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కుమారుడు అభయ్‌కు సంబంధించిన పలు విషయాలను ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా కుమారుడు అభయ్‌కు సంబంధించి ఎన్టీఆర్ ఓ ఆస్తకికరమైన ట్వీట్‌ చేశారు. ‘‘వాడు రోజు తాగాల్సిన పాల కోటా విషయంలో వాళ్ల అమ్మ నుంచి అభయ్‌ను కాపాడలేం’’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. వాళ్ల అమ్మ పాలు తాగమనడంతో.. అభయ్ భయంతో సైలెంట్‌గా కూర్చొని గ్లాసులో పాలు తాగుతున్న ఫొటోను కూడా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎన్టీఆర్ ట్వీట్‌పై స్పందించిన హాస్యనటుడు వెన్నెల కిషోర్.. ‘‘క్యూట్‌నెస్ ఓవర్‌లోడేడ్’’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేతా..’ సినిమాలో నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక  సంగీత దర్శకుడు తమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 

English Title
jr NTR tweets about his son Abhay
Related News