`ఝాన్సీ`గా జ్యోతిక‌

Updated By ManamSat, 07/14/2018 - 12:34
jhansi

jhansi హీరో సూర్య‌ను పెళ్లాడిన త‌ర్వాత సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న జ్యోతిక త‌ర్వాత `36 వ‌య‌దినిలే` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత మ‌గ‌లిర్ మ‌ట్ర‌మ్‌, నాచియార్ సినిమాల్లో న‌టించింది. ‘నాచియార్’ సినిమాలో జ్యోతిక పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాలో జి.వి.ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. బాలా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమా తెలుగు హ‌క్కుల‌ను డి.వి.సినీక్రియేష‌న్స్ అధినేత డి.వెంకటేశ్ ద‌క్కించుకున్నారు. త్వ‌ర‌లోనే తెలుగులో `ఝాన్సీ` పేరుతోవిడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత డి.వెంక‌టేశ్‌. 

English Title
Jyothika coming as Jhansi
Related News