3న జ్యోతిక  ‘ఝాన్సీ’ విడుదల

Updated By ManamSat, 07/28/2018 - 18:16
jyothika jhansi movie
Jyothika

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధంగా ఉంది అని మన్నందరికి తెలుసు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది. కోనేరు కల్పన మరియు  డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా  సంయుక్తంగా  ఆగష్టు 3న విడుదల కు అని ఏర్పాట్లు చేస్తున్నారు.

సంచలనాల దర్శకుడు బాల తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమా తీశారు. విక్రమ్ నటించిన సేతు, సూర్య నటించిన నందా, సెన్సషనల్ హిట్ అయినా శివపుత్రుడు, విశాల్ తో వాడు వీడు, ఇలా ఎన్నో విజయాలు అందుకున్న బాల గారు జ్యోతిక తో నాచియార్ సినిమా తీశారు. తమిళనాడు లో ఘానా విజయం సాధించింది. జ్యోతిక ఒక్క పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనబడుతుంది. తెలుగులో  ఝాన్సీ పేరుతో ఆగష్టు 3న విడుదలకు కానుంది. ఇళయరాజా సంగీతం మరో హైలైట్. జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ ‘నాచియార్ చిత్రం తమిళం లో ఘానా విజయం సాధించింది. స‌న్సేష‌న‌ల్ డైరెక్టర్ బాల స్వయ దర్శకత్వం నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు హక్కులు మాకు దక్కటం చాల సంతోషం గా ఉంది. బాల గారి అద్భుతమైన దర్శకత్వం ఒక్క ఎత్తు అయితే జ్యోతిక గారి నటన మరో ఎత్తు. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడినది. 

ఇప్పుడు ఈ సినిమా తెలుగు లో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఆగష్టు 3నా విడుదల కు సిద్ధంగా ఉంది. తమిళం లో ఎంతో  విజయం సాధించిన ఈ సినిమా పై తెలుగు లో అంచనాలు భారీగా ఉన్నాయ్. బయర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ ల దగ్గర నుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది" అని తెలిపారు

English Title
Jyothika Jhansi Movie release on 3rd August
Related News