కె.బాలచందర్ కుటుంబం అప్పుల ఊబిలో ఉందా..?

Updated By ManamTue, 02/13/2018 - 18:10
balachander

balachanderసినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగు వెలిగిన ఎంతోమంది దిగ్గజాలు చివరి రోజుల్లో ఎంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొందరి గురించి బతికున్న రోజుల్లోనే తెలిస్తే.. మరికొందరి విషయాల్లో మాత్రం వారు మరణించాకే తెరవెనుక వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. అలాంటి వారి జాబితాలోనే నిలుస్తారు ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్. సెల్యూలాయిడ్‌‌పై అందమైన ప్రేమకథల్ని సృష్టించి.. ఎందరికో నటనలో ఓనమాలను దిద్దించిన ఈ దర్శక దిగ్గజం ఇప్పుడు మన మధ్యలో లేరు. కానీ ఇప్పుడు ఆయనకి చెందిన అసలు నిజం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ప్రఖ్యాత దర్శకుడి కుటుంబం ప్రస్తుతం అప్పుల్లో కూరుపోయిందనే వార్తతో కోలీవుడ్ ఉలిక్కిపడింది.

బాలచందర్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా కవితాలయ బ్యానర్‌పై 50కి పైగా సినిమాలను కూడా నిర్మించారు. అయితే చిత్ర నిర్మాణం అంత తేలిక కాదు కదా.. తీసిన ప్రతి సినిమా లాభాన్ని తీసుకురాదు. అలా బాలచందర్ ఒక సినిమా కోసం యూకో బ్యాంక్ నుంచి కోటీ 36 లక్షల అప్పును చేశారు. ఎన్ని నోటీసులు పంపినా స్పందించకపోవడంతో సదరు బ్యాంక్... కవితాలయ కార్యాలయంతో పాటు చెన్నై మైలాపూర్‌లోని రెండు ఇళ్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. అయితే ఆస్తుల వేలం విషయాన్ని బాలచందర్ కుటుంబం తోసిపుచ్చింది. ఆస్తులను కుదువ పెట్టి అప్పు తీసుకున్నామని.. అయితే దానిని యూకో బ్యాంక్‌తోనే సెటిల్ చేసుకుంటామని వారు చెప్పారు. తాము ఒక స్థాయికి రావడానికి కారణమైన గురువుల పరువును కాపాడటం శిష్యుల బాధ్యత.. మరి బాలచందర్ పెట్టిన భిక్షతో స్టార్లుగా వెలుగొందుతున్న వారు.. ఆయన కుటుంబాన్ని అప్పుల ఊబిలోంచి బయట పడేసి గురువుగారి రుణం తీర్చుకోవాలనే కామెంట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

English Title
k balachander family losses
Related News