'కాలా' ఫైట్ వీడియో లీక్

Updated By ManamTue, 02/13/2018 - 12:18
Kaala

Kaalaరజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాలా'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎలాంటి లీక్‌లు రాకుండా చిత్ర యూనిట్ చర్యలు తీసుకున్నా.. తాజాగా రజనీ ఫైటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

ఎడిటింగ్ టైంలో ఈ సీన్ లీక్ అయినట్లు చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లీకేజ్ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఈ చిత్రంలో రజనీ సరసన హ్యూమా ఖురేషి నటిస్తుండగా.. సముద్ర ఖని, నానా పటేకర్, ఈశ్వరీ రావు, అంజలి పాటిల్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనునన్నారు. ధనుష్ నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించాడు.

 

English Title
Kaala fighting video leaked
Related News