విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌గా కైకాల

Updated By ManamTue, 02/13/2018 - 22:34
kaikala satyanarayana

kaikala satyanarayanaఐదున్నర దశాబ్దాల ప్రస్థానంలో నవ్వించి.. కవ్వించి.. ఏడిపించి.. నవరసాల్లో ఏ రసాన్నైనా ఏకధాటిగా చేయగల సత్తా ఉన్న నటుడిగా.. నవరసనట సార్వభౌమగా ఖ్యాతి గాంచిన కైకాల సత్యనారాయణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవలకు గానూ సత్యనారాయణను విశ్వ విఖ్యాత నట సామ్రాట్ బిరుదుతో సత్కరించింది టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ బిరుదును ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రి గంటా, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి, ఎంపీ మురళీమోహన్, హీరో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ బిరుదు కేవలం కైకాలకు దక్కిన గౌరవంగా కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని బాలయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సత్యనారాయణ వంటి నటులను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

English Title
kaikala satyanarayana honored as viswa vikyatha nata samrat
Related News