రామ్‌కు హీరోయిన్‌ ఫిక్స్ 

Updated By ManamWed, 03/21/2018 - 11:45
ram

Ram, Kajal గతేడాది 'ఉన్నది ఒక్కటే జిందగీ'తో యావరేజ్ హిట్‌ను సొంతం చేసుకున్న రామ్.. ప్రస్తుతం నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు రామ్.

ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ మూవీలో రామ్ సరసన హీరోయిన్‌గా కాజల్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కాజల్ అగర్వాల్ కాల్షీట్లను కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వెనిగల్ల ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే రామ్, కాజల్ కాంబినేషన్‌లో ఇంతకుముందు గణేష్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

English Title
Kajal agarrwal romance with Ram second time
Related News