పాత్ర తక్కువైనా రెమ్యునరేషన్ కావాల్సిందే

Updated By ManamWed, 02/21/2018 - 09:07
Kajal Agarwal

Kajal Agarwal అసలే ఆఫర్లు తక్కువగా వస్తున్నాయి.. అయితేనేం రెమ్యునరేషన్‌లో ఏ మాత్రం తగ్గేది లేదంటోంది టాలీవుడ్ చందమామ కాజల్. ఈ నేపథ్యంలో మరో మూవీని కూడా వదులుకున్నట్లు ఇప్పుడు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కాజల్ ఓ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం ఇచ్చి తీరాల్సిందే అని చెబుతుందట. దీంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే ఇదే సినిమాలో అవకాశం సొంతం చేసుకున్న నిత్యామీనన్ సైతం రెమ్యునరేషన్‌ వల్ల తప్పుకోగా.. ఆమె స్థానంలో హలో ఫేం కల్యాణి ప్రియదర్శన్ రానుంది.

English Title
Kajal Agarwal no compromise in Remunaration
Related News