కకావికలం

Updated By ManamMon, 04/23/2018 - 00:44
East Godavari

mahiతూర్పుగోదావరి జిల్లాలోని సముద్ర భాగంలో వశిష్ఠ, ఎస్-1 అన్వేషణలలో సహజవాయువు నిక్షేపాలను వరుసగా 2005, 2006 సంవత్సరాలలోనే జీఎన్‌జీసీ కనుగొన్నది. ఇప్పుడు ఈ క్షేత్రాలలో 4 ఉత్పత్తి బావులకై డ్రి ల్లింగు, ఉత్పత్తికి కావలసిన పనులను పూర్తిచేయడం, సముద్రంలో పైపులైను వేయడం, ఓడల రేవు దగ్గర ఉన్న టెర్మినల్ విస్తరణ మొదలైన పనులను చేపట్టారు. వశిష్ఠ ‘బ్లాక్’ 119 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. పై పనులను చేపట్టడానికి ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలను డిసెంబర్ 3వ తేదీన ఓడల రేవు గ్రామం వద్ద సభ నిర్వహించారు. చమురు, సహజవాయువుల ఉత్పత్తికి సంబం ధించిన పర్యావరణ సవుస్యలు చాలా క్లిష్టైవెునవి, అత్యంత శాస్త్ర, సాంకేతిక విషయాలతో కూడుకొన్నవి. వీటిపై పరిజ్ఞానం ‘సూపర్ స్పెషలైజేషన్’ కింద వస్తాయి. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాలపై కేవలం ఇప్పటికిప్పుడు జరిగే వారి ఆస్తినష్టాలకు సంబంధించి మాత్రమే స్పందించగలరు. పర్యావరణం సంబంధించి వారికెంత మాత్రం తెలియదు. అందుచేత ఈ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వమే క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ కార్యక్రమాల వల్ల సంభవించే నష్టాలు, లాభాల గురించి ప్రజలకు వివరించి వారి అభిప్రాయం సేకరిస్తే బాగుంటుంది. ఇందు లో భాగంగా వారు సవుర్పించే పర్యావరణ ప్ర భావిత అంచనాల రిపోర్టు కూడా సామాన్య ప్ర జానీకానికి అంతుపట్టనిది. ఫలితంగా దీర్ఘకాలం లో జరిగే పర్యావరణ ప్రభావాలకు ఇక్కడి ప్రజలు బలిపశువులవుతారు. చమురు, సహజ వాయవుల ఉత్పత్తిని సహజ వనరులను గనుల నుంచి తీసే కార్యక్రమంగా కాక ఒక పరిశ్రమగా పరిగణనలోకి తీసుకొని, వీటి ఉత్పత్తి వల్ల జరిగే అవకాశమున్న గాలి, నీరూ, నేలా కాలుష్యాలపై దృష్టి సారించి ఈ విషయాలపై పైన చెప్పిన ఇఇఎ రిపోర్టును సవుర్పిస్తూ వచ్చారు. కాని ఈ హైడ్రోకార్బన్‌ల ఉత్పత్తి వలల కె.జి. బేసిన్‌లో ఉన్న ఇసుక రాతి పొరల క్షేత్రాల్లో భూమి కుంగుతుంది. ఈ కుంగుదల కొన్ని దేశాల్లో 30 అడుగుల వరకు ఉంది. ఇదే జరిగితే మన డెల్టాలు సముద్రంలో మునిగి కనువురుగవుతాయి. ఓఎన్‌జీసీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చమురు, సహజ వాయువుల ఉత్పత్తిని చేస్తోందని అందుమూలం గా డెల్టాలో భూమి కుంగుతున్న నిదర్శనాలున్నాయని 2008లో భీవువరంలోని కృష్ణా -గోదా వరి డెల్టాల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి (డబ్లూపి.నెం.13341) భూమి కుంగుదల విషయంపై అధ్యయనం చేపట్టమని కోరారు. అందుకు అనుగుణంగా, హైకోర్టు ఆదేశంపై కేంద్ర పర్యావర ణం, అడవుల మంత్రిత్వశాఖ సబ్ కమిటీని నియుమించారు. వారు ఇచ్చిన సిఫారసులననుసరించి (29, అక్టోబరు) ఇప్పటి ఇఐఎ రిపోర్టులో భూమి కుంగుదల విషయాన్ని ప్రస్తావించి, అం దుకు కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లు చెప్పారు. కానీ, సబ్ కమిటీ రిపోర్టులోని మొట్టమొదటి వాక్యాన్ని ఉటంకిస్తూ కెజి బేసిన్ భూమి కుంగుదలకు అనుకూలంగా లేదని చెప్పారన్నారు. 

అ యితే ఈ రిపోర్టును ఇంకా హైకోర్టుకు ఇచ్చినట్లు లేదు కాబట్టి, దీనిపై వ్యాఖ్యానించడానికి అవకాశం రాలేదు. గల్ఫ్ దేశాల్లో మాదిరి సున్నపురాయి రిజర్వాయుర్లయితే ఈ సమస్య ఉత్పన్నం కాదు. రిపోర్టులోని మిగతా అంశాలన్ని పిటిషనుదార్లు ఆశించిన మేరకు శాస్త్రీయంగా ఉన్నాయి. ప్రపంచంలో చాలా చోట్ల భూమి కుంగుదలకు చమురు, సహజ వాయువుల ఉత్పత్తి కూడా కారణమనీ, అందుచేత తత్సంబంధిత ప్రాజెక్టులు చేపట్టినప్పుడు భూమి కుంగుదల విషయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కెజి బేసి న్ గత కొంతకాలంగా ఈ ఉత్పత్తులు జరుగుతున్నందున, ఇంతవరకు భూమి ఎంత కుంగింది, భవిష్యతులో ఎంత కుంగుతుందనే వి షయంపై అధ్యయనం ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ వైున్స్’ ధన్‌బాద్ లాంటి సంస్థకు అప్పగించాలని సూ చించింది. దీనిపై మంత్రిత్వ శాఖ చర్య ఏమిటో తెలియదు. అయితే ఇప్పుడు జరుపబోయే ప్రాజె క్టు విషయంలో, సబ్ కమిటీ సూచన మేరకు ఇ.ఐ.ఎ అధ్యయునంలోనే భూమి కుంగుదలపై ప్ర స్తుతం భూమి ఎత్తు సూచించే సమాచారాన్ని త ప్పనిసరిగా పొందుపరచాలని ‘టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్సు’లోనే పర్యావరణ మంత్రిత్వశాఖ చేర్చ డం ముదావహం. ఓఎన్‌జీసీ భూమి కుంగుదల విషయమై వారి వద్ద ఉన్న సమాచారం కొంత ఇఐఎ రిపోర్టులో ఉంచారు. ఉత్పత్తి బావులు, కొన్ని ‘సైస్మిక్ సర్వే’ నిమిత్తం నిర్మించిన స్తం భాల వద్ద 1988 - 2000 మధ్య తీసిన భూమి ఎత్తుకొలతలను, అక్కడే తిరిగి 2008లో తీసిన కొలతలను ఇచ్చి, ఈ రెండు కొలతల్లో వ్యత్యాసం ఎక్కువగా లేదు, అది కూడా కొలతల్లో వచ్చిన తేడాలే అని సమర్థించుకొన్నారు. అందుచేత భూమి కుంగుదల లేదని చెప్పారు. కానీ వారి కొలతల్లోనే 13 సెంటీమీటర్ల నుంచి 95 సెంటీమీటర్ల వరకు వ్యత్యాసముంది. అంటే సంవత్సరానికి 1 సెంటీమీటరు కన్నా తక్కువ నుంచి 15 సెంటీమీటర్ల వరకు (మొదటి 5-7 సంవత్సరాలు దాటిన తరువాత భూమి దిగడం ప్రారంభమవుతుంది) ఉంది. నాలుగు చోట్ల 2009 లో మళ్ళీ కొలతలు తీశారు. ఆ ఒక్క సంవత్సరంలోనే 5 నుంచి 28.5 సెంటీమీటర్ల వరకు ఉన్న వ్యత్యాసం ఇతర దేశాల్లోని కుంగుదల రేటుతో సరిపోతుంది. క్షేత్రస్థాయిలో చూస్తే, ఇప్పటి డ్రెయిన్‌లలోను, నదులలోను పోటు నీరు పూర్వం (ఈ ఉత్పత్తులు మొదలు కాక ముందు) కన్నా 4- 5 అడుగులు పైకి వచ్చింది. సముద్ర మట్టంలో తేడా లేనప్పుడు, ఇలా పోటు నీరు పైకి రావడం భూమి కుంగుదల వల్లనే అని తెలుసుకోవాలి. నీటిమట్టంతో ఎటువంటి తప్పులు దొర్లవు. భవిష్యత్‌లో కుంగుదల గురించి నిర్ణీత రోజుల్లో కొలతలు తీసే పథకాన్ని సబ్ కమిటీ సూచించినట్లు అమలు చేస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రాంతంలో హైడ్రోకార్బన్ లను ముఖ్యంగా సహజవాయువును గత 13- 25 సంవత్సరాల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి దాని ప్రభావం కుంగుదల విషయంలో ఇప్పటికే ఉంది. మరికొన్ని బావులు తవ్వి ఉత్పత్తిని పెంచితే ఈ కుంగుదల వేగం పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న కుంగుదల వేగం  భూమి కుంగుదల ఎంతవరకు జరిగింది లేదా వారు చెప్పినట్లు జరగలేదో తెలియాలంటే, అసలు ఈ హైడ్రో కార్బన్ ఉత్పత్తి మొదలు కాక ముందు ఉన్న భూమి ఎత్తు, ఇప్పుడున్న ఎత్తు తెలియాలి. అంటే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు సర్వే చేయించి, పూర్వం 1966-68లో సర్వే ఆఫ్ ఇండియా ‘బెంచ్‌మార్క్’లతో పోలిస్తే, విషయం తేటతెల్లమవుతుంది. అందుచేత ఈ రెండు కొలతలలో ఒక ‘గ్రిడ్’ ప్రకారం ‘వేుప్’లలో సూచించి, ‘టీఓఆర్’ ప్రకారం ఇప్పుడే సమకూర్చాలి. అయితే పైన వివరించినట్లు వారి కొలతలను బట్టే భూమి కుంగుతున్నట్లు నిర్ధారణైంది. అవసరమైతే రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో కూడా తెలుసుకోవచ్చు. కింద వివరించినట్లు క్షేత్రస్థాయిలో మరెన్నో నిదర్శనాలున్నాయి. ప్రాజెక్టు ప్రాంతం సహా డెల్టాలో భూగర్భజలాలు (ఇళ్ళవద్ద మంచినీటి బావులు) ఉప్పు బారిపోయాయి. కింది పొరలలో ఉన్న పూర్వకాలం నాటి సముద్రపు నీరు భూమి కుంగుతుండడం వల్ల పైకి ఉబికి వచ్చి పైన ఉన్న మంచినీటి భూగర్భ జలాలతో కలిసిపోయాయి. డ్రెయిన్‌లలోనూ, నదులలోనూ సుమారు 5 అడుగుల వరకు పోటునీరు పైకి వచ్చింది. ఆ నీరు తగ్గడానికి. చాల చోట్ల సముద్రం కొన్ని వందల మీటర్లు భూమిపైకి చొచ్చుకువచ్చింది. ఓడల రేవు వద్దనే ఒడ్డున ఉన్న రెండు సహజ వాయువు బావుల ప్రాంతంలో 600 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. భూమి ఎత్తులపై ‘బేస్‌లైన్ డాటా’ను సమకూర్చి, ప్రజల్లో ఉన్న అనుమానాలు, భయాలు తొలగించి, కెజి బేసిన్ నుంచి సహజ వాయువు ఉత్పత్తిని కొనసాగించడానికి, ఇప్పుడు ప్రతిపాదించిన ఉత్పత్తిని పెంచడానికి చర్యలు చేపట్టవచ్చు.
ప్రొఫెసర్ జి. కృష్ణారావు
జియాలజి విశ్రాంత అచార్యులు, 
ఆంధ్రా యూనివర్శిటి

English Title
Kakavikalam
Related News