తాత్వికులకు ఊపిరి పోసిన ‘కక్క-సిద్ధి’ 

Updated By ManamSun, 03/11/2018 - 22:21
image

imageమనువాద విషాన్ని ఛేదిస్తూ అంట రానిదిగా భావించిన తొలి తాత్వికులైనా మాదిగల జీవన సంఘర్షణలను అక్షరా లుగా మలిచి, తనజాతి సంస్కృతులకు ఊపిరిపోస్తూ రాసిన రచయిత వేముల యల్లయ్య. విభిన్న సంస్కృతులతో తేజో మయంగా వెలుగుతున్న దేశంలో ఎన్నో వైవిధ్యాలకు, విరుద్ధాలకు లోనై కారుచీకటిలో నెట్టివేయబడిన ఈ దేశ నిర్మాతల చెమట చుక్కల్లో మెరుపు తెచ్చిన సాహి త్య సంపదనే ‘కక్క’, ‘సిద్ధి’ నవలలు. అను భవాలకు అక్షర రూపమిచ్చిన సాహిత్యమే ప్రజలను అందునా పీడుతులను చైతన్యవంతు లను చేస్తూ చరిత్రలో మరణమెరుగని సాహిత్య మౌతుంది. సాహిత్య రంగంలో తన కులానికే కాక తనజాతిని అంటిపెట్టుకుని ఉన్న అనేక జనసమూహా లను సబ్బండ కులాలతో తనజాతి సత్సంబంధా లను ఆయా కులాలు తన కులాన్ని ఎలా వాడుకుని అవమాన పరిచేతీరును సబ్బండ కులాల పుట్టుపూ ర్వాలను వివరించి రాసిన నవలలే ‘కక్క-సిద్ధి’ ఈ రెండు నవలలను ప్రజాశక్తి బుక్ హౌస్ ఒక్కటిగా ముద్రించి అందిండం హర్షణీయం! నవల ప్రక్రియలో తనదైన శైలిలో ముద్ర వేసిన వేముల యల్లయ్య మొదట రచించిన మాదిగ కక్క జీవితాన్ని పరిశీలిస్తే, కాలజ్ఞాన తత్వబోధిగా పూజలందుకుంటున్న పోతులూరికి తెచ్చిన మొదటి శాస్త్రీయ దృక్పథం కలిగిన శిష్యుడు మాదిగ కక్కడు. తనజాతికి అడుగడుగునా ఎదురైన సవాళ్ళను ఛేదించుకుంటూ తన కులమే ఈ ప్రపంచానికి తత్వాన్ని, మానవీయతను, ప్రజాస్వామిక విలువలను అందించి మూఢత్వంపై సమరశంఖం ఊది మనిషిని మనిషిగా బతకమంటూ వెలివేయబడి న తన చరిత్రను గొప్పదిగా భావించి పెద్దమాదిగతనాన్ని గౌరవంగా స్వీకరిస్తాడు కక్కడు. తల్లికడుపుల ఉన్నప్పుడే (పటేలు పొలం దున్నుతున్న సమయంలో ఎర్రతేలు కరిచి సచ్చిన గాలయ్య)తండ్రిని కోల్పోయిన కక్కడు అనేకానేక విపత్కర పరిస్థితులను ఒరసకు తాతైన పకీరయ్య సాయంతో అధ్యయనం చేస్తాడు. చదువులకు దూ రం చేయబడిన కులజాబితాల్లో మొదటి వరుసలో ఉండే మాదిగలవాడలో అనేక కట్టుబాట్లకులోనై ఉండటం సహజమే కారణం సనాతన సంప్రాదాయ మూఢరచనలు వీరి జీవితాలపై మోపడమే ఈ భూమి మీద మొదటి తాత్వికపరులు మాదిగలే అనుటకు మనం చదువెరగని కక్కని జీవితంలో చూడ వచ్చు. తల్లి కలెమ్మకు మళ్ళీ పెండ్లిచేసిన గొప్పవాడు కక్కడు భర్త తోనే చితిల పడేయమన్న సమాజానికి తోడులేని ఆలిని ఆడిపోసుకు తినే మానవ మృగాలకు గొప్ప సందేశం శరీరం ప్రకృతి ధర్మాన్ని పాటించిడంలోనే మానవీయతను చాటుకుంటుందనీ తన కులం పైచాచిక రాతల చట్రంలో ఇరుక్కోలేదనీ రచయిత చెప్పకనే చెప్పిండు.(పేజీ నెంబర్ 32-33)

పెదమాదిగ వొతన్ చేబట్టాలనుకున్న కక్కనికి తాత పకీరయ్య కుల చాకిరీ తోలుపనితో మొదలై సబ్బండ కులాలతో ఎటువంటి సంబంధాలు వైరుధ్యాలను చలవిచూడాలనో తెలుసుకుంటడు కక్కడు. మాదిగ బతుకులను సచ్చిన గొడ్ల తునక లను ఆకలితో స్వీకరించి దానినే అస్థిత్వంగా ప్రకటించుకున్న మాది గల ఆచార సంప్రదాయాలను కళలను, కన్నీళ్లను కళ్ళముందే ఆవిష్కరించారు రచయిత. ఈ నవల ప్రపంచ దృష్టిని ఆకర్షించి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధనా గ్రంథంగా నిలిచింది. ఇదే తరహాలో మరొక నవల సిద్ధి. ఆరుగురి ఆడోళ్ళతోడన పుట్టిన ఆఖరిది సిద్ధి. పేదరికం వల్ల తనకంటే ముప్పైయేండ్ల పెద్దవాైడెన పాపిగానికి ఇచ్చి పెండ్లి చేస్తరు. మాదిగల కుటుంబాలు నిత్యం తాగుడుతో ఉదయించి పొద్దు గూకే క్రమాన్ని అయినా కుటుంబ బరువును నిలబెట్టు కునే స్త్రీని రచయిత సిద్ధి, ఈమె భర్త పాపయ్య ద్వారా చూపిస్తడు. కాయకష్టం చేసుకునే తమ పిల్లలను ఎలా గైనా చదువించుకోవాలని ఆరాటపడే మాదిగల తల్లి దండ్రుల కష్టాన్ని ఆశతో కూడిన ఆరాటాన్ని మనకు ప్రత్యక్షంగా చూపెట్టారు రచయిత. సిద్ధి కొడుకు సైది గాడు బడికిపోయిన సందర్భంలో అక్కడి పిల్లలు వీడిని వివక్షగా చూడటం, గూడెంలో తనతోటి ఈడు పోరంగాడ్లంతా జీతాలు ఉండ టం వలన ఎదిగే పోరడైనా సైదిగానికి బాల్యం దిగాలుగానే ఉండేది. వేదన భరించిన మాదిగ మనసు కాస్త ప్రేమను ఉన్నతంగానే కోరు కుంటది. సైదిగానికి తనతో పాటు చదివే పటేళ్ళ బిడ్డ పద్మను ప్రే మించాలనుకోవడం, బడిలో ఆకృత్యాలు, అలాగే బడి హెడ్ మాస్టర్ గా దళితుడైన సత్తయ్యను అగ్రవర్ణాల బెదిరింపుల తీరును, సైద్గాడిని జైలు పాలుచేయడం వీడితోపాటు చదువుకున్న పటేల్ బిడ్డ అదే బడిలో టీచ్చరమ్మ కావడం, సైద్గాడు తిరిగి గ్రామంలోకి వొచ్చి ఊరి ని చైతన్యపథంలో నడిపేందుకు కులానికి పీడిత వర్గాలకు అంబే ద్కర్ను పరిచయం చేయడం ప్రాంతీయతలో జరిగే దోపిడీకి ప్రాంతీ యతపై మమకారాన్ని చాటుతూ తెలంగాణ కోటిరత్నాల వీణంటూ పాటతో నడిపించడం మన చరిత్ర గీ పాఠాలలో లేదని వాపోవడం  అంబేద్కర్ బాటలో పోరాటాన్ని చూపడం మనకు పుస్తకంలో కనబ డుతుంది. మాదిగల జీవన శైలి, వారి తత్వానికి ధైర్యనికి త్యాగాలకు ప్రతీకగా ఈ రెండు నవలలు నిలబడినవి. 

image 

 

 

వరకుమార్ గుండెపంగు

English Title
kakka sidhi
Related News