కల్యాణ్‌రామ్ యాక్షన్

Updated By ManamMon, 09/24/2018 - 00:32
kalyan ram

imageనందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సరసన నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లను వైజాగ్‌లో చిత్రీకరిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందట. ఆ కొత్తదనం ఏమిటో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

English Title
Kalyanram Action
Related News