రోడ్డు ప్రమాదం: గాయాలపాలైన ప్రముఖ హీరో

Updated By ManamMon, 09/24/2018 - 16:59
Darshan
Darshan

మైసూర్: మైసూర్ రింగ్ రోడ్డు హింకల్ బ్రిడ్జి సమీపంలో సోమవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ఉన్న కన్నడ ప్రముఖ నటుడు దర్శన్, సీనియర్ నటుడు దేవరాజ్, ఆయన కుమార్ ప్రజ్వల్ దేవరాజ్‌తో పాటు మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

వారిలో దర్శన్ కుడి చేయికి ఫ్యాక్చర్ అవ్వగా.. మిగిలిన వారందరికీ గాయాలయ్యాయి. వీరందరూ మైసూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీస్ కమిషనర్ సుబ్రమణ్యేశ్వర రావు మాట్లాడుతూ.. సోమవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినవెంటనే వాళ్లంతకు వారుగా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉంది. కేసును నమోదు చేసుకొని దర్యాప్తును చేస్తున్నాం అని తెలిపారు. అయితే భారీ వర్షం పడటంతోనే వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

English Title
Kannada actors Darshan, Devraj, Prajwal met with accident
Related News