నాగ్‌, నాని చిత్రంలో ఓ హీరోయిన్‌గా..

Updated By ManamWed, 02/14/2018 - 20:41
nag, nani

nag, naniనాగార్జున, నాని కాంబినేష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ  వైజ‌యంతీ మూవీస్‌ ఓ మల్టీస్టారర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల‌ 24 నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే..  ఈ చిత్రంలో నానికి జోడీగా క‌న్న‌డ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ న‌టించ‌నుంద‌ని తెలిసింది. తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’లోనూ, కన్నడ ఫిలిం ‘యూ టర్న్’లోనూ త‌న న‌ట‌న‌తో ఆకట్టుకున్న శ్ర‌ద్ధా ఈ చిత్రంతో తెలుగువారికి కూడా ద‌గ్గ‌ర‌వుతుందేమో చూడాలి. ఇప్ప‌టికే ఆది సాయికుమార్‌తో ఓ సినిమా చేస్తున్న శ్ర‌ద్ధాకి ఇది రెండో తెలుగు చిత్ర‌మ‌వుతుంది. త్వ‌ర‌లోనే శ్ర‌ద్ధా ఎంపికపై అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది.   

English Title
kannada beauty in nag, nani film
Related News