ఆ ఎరువులు ప్రాణాంతకం, నిషేధించండి: హీరో కార్తి

Updated By ManamMon, 09/24/2018 - 12:30
Karthi

Karthiసినిమాల్లోనే కాకుండా బయటకూడా ప్రజల సమస్యలపై మాట్లాడే హీరోలలో కార్తీ కూడా ఒకరు. ముఖ్యంగా మధ్య తరగతి, రైతుల సమస్యలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా రైతులకు ప్రాణ నష్టం కలిగించే ఓ క్రిమి సంహారక మందును నిషేధించాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన కార్తి అందులో.. గ్లైపోసేట్ ఉన్న ఎరువులు క్యాన్సర్‌కు కారణమవుతాయి. వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. అమెరికా కొన్నేళ్ల క్రితమే గ్లైఫోసేట్‌ ఉన్న మందులను నిషేధించింది. తమిళనాడు ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ చర్య తీసుకుంటుందని భావిస్తున్నా అంటూ విఙ్ఞప్తి చేశారు. కాగా ‘కడైకుట్టి సింగమ్’ (తెలుగులో చినబాబు) చిత్రంలో కార్తీ రైతు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర చేస్తున్నప్పుడు తనకు వ్యవసాయం చేయాలనిపించిందని కార్తీ ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.

 

English Title
Karthi demands ban on Glyphosate pesticides
Related News