కరుణ్ నాయర్‌కు పగ్గాలు

Updated By ManamFri, 09/21/2018 - 23:46
karun-nair
  • ఈ నెల 29న వెస్టిండీస్‌తో ప్రాక్టీస్  మ్యాచ్

karun-nairన్యూఢిల్లీ: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ కెప్టెన్‌గా బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ బాధ్యతలు చేపట్టాడు. ఈ నెల 29న వెస్టిండీస్‌తో  జరగబోయే వార్మప్ మ్యాచ్‌కు బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడని బీసీసీఐ శుక్రవారం తెలిపింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ వడోదరాలో రెండు రోజుల పాటు జరగనుంది. ఈ మ్యాచ్‌కు 13 మంది సభ్యులతో కూడిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుని  బీసీసీఐ  ప్రకటించింది. వెస్టిండీస్ జట్టు సుమారు రెండు నెలలపాటు భారత్‌లో పర్యటించనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో విండీస్ జట్టు భారత్‌తో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ అక్టోబర్ 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో జరగనుండగా, రెండో టెస్టు అక్టోబర్ 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: మయాంక్ అగర్వాల్, ఫృథ్వీ షా, హనుమ విహారి, కరుణ్ నాయర్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్‌నే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, సౌరభ్ కుమార్, బసిల్ థంపీ, అవేష్ ఖాన్, విగ్నేష్, ఇషాన్ పొరెల్. 

Tags
English Title
Karun Nair gets revenge
Related News