కథా కళింగానికి ‘చాసో స్ఫూర్తి’ కీర్తి

Updated By ManamMon, 02/12/2018 - 02:11
image

imageతాను సంపాదకత్వం వహించి అచ్చు వేసిన కథలకు  సుప్రసిద్ధ కథకుడు, విజయనగరం కథల సంతకం చాసో,  దశాబ్దాల కిందట, ‘కళింగ కథానికలు’ అని పేరు పెట్టారు. అందులో అన్నీ తెలుగు కథలే అయినా, ఈ ప్రాంతం ఉమ్మడి సంస్కృతికి చెందిన కళింగాంధ్రగా, చాసోకి గల అవ గాహన, భావితరాలతో పంచుకునే పని ఇది.  విశాఖకు  చెందిన ప్రముఖ కథకులు,  విశాఖ సాహితి అధ్యక్షులుగా  సేవలు అందించిన అచ్యుత రామరాజు కూడా,  ఇది కళింగాంధ్ర ప్రాంతం అని తరచూ  గుర్తుచేస్తూండే వారు. గోదావరిదరి పిఠాపురం వరకూ, కళింగ రాజ్యం అని తెనాలి రామకృష్ణుడు, తన భక్తి ప్రబంధం పాండురంగ మహాత్మ్యంలో పక్కాగా వందల ఏళ్ల కిందటే రాశారు. గురజాడ, కన్యాశుల్కంలో, కరటక  శాస్త్రి చేత, ‘నీలాంటి  కాంతామణే  లేకపోతే, ఈ కళింగ రాజ్యానికి ఎంత లోటు  వచ్చి ఉండేది’ అనిపిస్తారు మధురవాణితో మాట్లాడుతున్నప్పుడు. కన్యా శుల్కం తొలి ప్రదర్శన 1892లో  విజయనగరంలో ఇచ్చినది జగన్నాథ విలాసినీ నాటక సమాజం. దీనికి  మహారాజు ఆనంద గజపతి ప్రోత్సాహముండేది. ఒడియా, తెలుగు భాషలు మాట్లాడేవారు, మహానది, గోదావరి మధ్య ప్రాం తాల్లో ఉన్నారు అన్నది ఒక చారిత్రిక వాస్తవం. తెలుగు సాహిత్య అవార్డ్‌లన్నీ తెలుగు వారి  చుట్టూ  బొంగరాల్లా, ప్రాంత ప్రేమ, వాదాల ప్రేమ, కుల సమీకరణాలు కూడా జోడై తిరుగాడ్డం చూస్తూ ఉన్నాము.  ఇరుగు పొరుగు  భాష ల  వేపు చూసే అలవాటు పెద్దగా తెలుగు వారికి లేదు. ఒక ఎన్టీఆర్ పురస్కారం పేరిట మాత్రమే  తెలుగు నేల మీంచి  కొందరు భారతీయ స్థాయి రచయితలకు కొన్ని సాహిత్య గౌ రవ పురస్కార ప్రదానాలు జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో, ఇరవై మూడవ చాసో స్ఫూర్తి  అవార్డ్, ప్రముఖ ఒడియా  కథా రచయిత గౌర హరి దాస్‌కు ఈ నెల పదిహేడున, విజయనగరంలో ప్రదానం జరగిన సంఘటన   బహుధా  స్వాగతనీయం.


1981 నుంచీ  కథలు రాస్తూ నేటికీ పదిహేడు కథా సం పుటాలు ప్రచురించిన గౌరహరి దాస్, ఒడియా సాహిత్యంలో  సుప్రసిద్ధimage సాహితీవేత్త. పత్రికా రంగంలో అత్యధిక జనాద రణ గల  ‘సంబాద్’  దినపత్రికకు ఫీచర్స్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముప్పై ఎనిమిదేళ్ళ సాహిత్య జీవితంలో, పలు అవార్డ్‌లు,(రాష్ట్ర సాహిత్య అకాడెమీ, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్‌లతో బాటుగా)  పొందారు. ఆరు నవలలు,  కవిత్వం, నాటకం, యాత్రాసాహిత్యం, సంకలనాల సంపాద కత్వ నిర్వహణ,  కాలమ్ నిర్వహణ, ఇలా పలు సాహిత్య రూపాలలో తన రచనా ప్రతిభ కన్పరుస్తున్నారు. పలు దేశా లలో పర్యటించి,  ప్రపంచ సాహిత్య స్వరాల్లో తన తూర్పు భారత, ఒడియా సాహిత్య  స్వరాన్ని కూడా వినిపించారు.  గౌరహరి  రచయిత, జర్నలిస్ట్ కూడా,  ఒడియా రాష్ట్ర స్థాయి అవార్డ్‌లు ఎన్నో స్వీకరించారు. ఇలా సాహిత్య రంగంలో పలు మాధ్యమాల్లో పాత్ర లు పోషిస్తూ వస్తున్న ఈ యన భద్రక్ సమీపంలో ఒక  పల్లెటూరులో  పుట్టా రు. ప్రస్తుతం పాత్రికేయ త్తి దృష్ట్యా భువనేశ్వర్‌లో ని వాసం. ‘జ్వరాభాట’ (1981) వీరి తొలి కథా  సంపుటి కాగా, ‘ఛాయా సౌధర  అబశేష’(1996) వీరి తొలి నవలా రచన.


వీరి కథా సంపుటాలు కొరాపుట్, లిటిల్ మంక్ అండ్ అదర్ స్టోరీస్, ద నెయిల్  అండ్ అదర్ స్టోరీస్,  షేడ్స్ ఆఫ్ లైఫ్ (నవలిక) imageఇంగ్లీష్‌లోకి అనువాదం అయ్యాయి. తెలుగు ఒడియా సాహిత్య రంగాల మధ్య మరింత సహకారపూర్వక  ఉమ్మడి సాహిత్య కార్యక్రమాలు, అదాన ప్రదానాలు జరగ డానికి ఇటువంటి ఉమ్మడి గుర్తింపులు చాలా అవసరం. ఇందుకు చాసో కుమార్తె, చాగంటి తులసి అభినందనీయు రాలు. మరొకందుకు కూడా ఆమెకు సాహిత్యలోకం రుణపడి ఉన్నది. చాసో సభావేదిక పేరిట, విజయనగరంలో సాహిత్య సభలు జరగడానికి వీలుగా, గురజాడ జిల్లా గ్రంథాలయం మొదటి అంతస్తులో, ఒక సమావేశ భవన నిర్మాణానికి ఆమె స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి మేచింగ్ గ్రాంట్ అందచేసి, గతవత్సరమే, ఈ సభావేదిక నిర్మాణం పూర్తయి, అందు బాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అందువల్ల, ఈ ఇరవైమూడవ చాసో స్ఫూర్తి పురస్కారం తొలిసారిగా, ఘనంగా, చాసో సభా వేదికపై జరిగింది.


చాసో రాసిన ‘పరబ్రహ్మం’ కథలో, అన్నం కోసం, ఒక పిచ్చివాడు, అంగలార్చి, మిలిటరీ భోజన హోటల్ లోంచి పెరట్లోకి గిరాటేసే ఎంగిలి విస్తరి కోసం రెండు చేతులను  చాచి నిలబడతాడు ఆ విస్తరి వచ్చి వాడి చేతిలో పడుతుంది . ఇది ఒక బిగిగల కథకు ముగింపు. ‘అన్నమే పరబ్రహ్మం’ ఆకొన్నవారికి, పేదవారికి, రోజుల తరబడి అన్నార్తులకు అని చాసో చెప్పే ఈ కథ, లోకం తీరుపైన ఒక కలం చి త్రం. అన్నం దొరక్క అంగలార్చే  పిచ్చివాడు ఈ కథలో కనిి పస్తే,  గౌరహరి రాసిన ‘సుదామ్ జెనా ఎక్కడికెళ్ళాడు?’ కథలో విస్తరి నిండా (అదే లంచ్ ప్లేట్ లో) ఒక కార్పొరేట్ వర్కింగ్ లంచ్ సమయంలో నాజూకు లంచ్ పద్ధతులు ఎరగక,, తమ కంపెనీ యజమాని, ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కుదు ర్చుకుంటున్న అమెరికన్ వ్యాపార బృందం, ఆకలితో ఉంటారని, వీరికి ప్లేట్ నిండా ఆహారం వడ్డించినందుకు  సుదామ్ జెనా, తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఆ వడ్డింపు సరిదిద్ది, తగు మాత్రం ఆహారంతో సరిపెట్టిన తరు వాత, ఒప్పందం కుదిరి, వెళ్లిపోతున్న అమెరికన్లలో ఒకరు, సుదామ్ చేతిలో ఒక పది డాలర్లు ఉంచి వెళ్తాడు. అప్పుడు ఏమీ ఆనకపోయినా, కంపెనీ  విదేశీ అగ్రిమెంట్ కుదిరి, కంపెనీ విస్తరణ జరిగాక, అక్కరలేని ఎన్నో ఉద్యోగాలను కంపెనీ తొలగించేస్తుంది. వారిలో సుదామ్ జెనా కూడా ఒకడు. తమ అగ్రిమెంట్ ప్రకారం పెట్టుబడులిచ్చి ఎలా కంపెనీ పని చేస్తున్నదో చూసేందుకు కొద్దికాలం తర్వాత  వచ్చిన ఆ అమెరికన్ యువకుడు, సుదామ్ జెనా  కోసం ప్రశ్నిస్తాడు. ఎవరూ మాట్లాడరు. అతనికి తల్లి అమెరికాలో ఒక భారతీయ వనిత. తన చిన్నప్పుడు ఆమె ఇలాగే  ప్లేట్‌లో నిండా అన్నం పెట్టేది. అదీ ఆ యువకుడికి సుదామ్ జెనా పట్ల గల సాధు హృదయం. చాసో కథలో పిచ్చివాడు, మనకందరికీ తెలుస్తూనే ఉంటుంది పేదవాడు. ఈ కథలో ప్లేట్ నిండా అన్నం వడ్డించి, ‘అయ్యో ఎంత ఆకలితో ఉన్నా రో కంపెనీ బాగుకోసం పని చేస్తున్నఈ పెద్దల’ని భావించిన సుధాముడు (కుచేలుడ్ని సుధాముడు అని కూడా పిలుసా ్తరు) కూడా పేదవాడే. ఇలా  గౌరహరి కథల్లో ఉన్నత జీవన సంస్కార దర్శన ప్రయాస, మనకు  సహజకల్పనగా, సమకాలీన ఒడియా సమాజం అంతా కనిపిస్తుంది.

‘మేకు’ అనే వీరి కథలో ‘ఏకు మేకయ్యాడు’ అనే సామె తకు అన్వయంలాగా, కన్యాశుల్కంలో మన రామప్పంతులు వలె తోచే  కయ్యాలకోరు (లిటిగంట్) నకుల్ నాయక్  పాత్రను చిత్రిస్తాడు. ఈ పాత్ర  ఉన్నదానికీ, లేని దానికీ అందరిపై క్రిమినల్ కేసులు బనాయించి, సాక్ష్యా లు పుట్టించి, వారి జీవితాలు అస్తవ్యస్తమయ్యేలా చేసి, అందులో పైశాచికానందాన్ని పొందే పాత్ర. ఊరిజనం మీద ఇలా అన్యాయాలకు, తప్పుడు కేసులకు తండ్రి పాల్పడ్డం చూడలేక, కొడుకు, తండ్రిపై కేసు బనాయిస్తాడు. జాతీయ భద్రతకు కీలకమైన చండిపూర్ ఆయుధ పరీక్ష కేంద్రం డిజైన్లను  తండ్రి కేంద్రపారాలోని బంగ్లా దేశీయులకు అమ్మ చూపుతున్నాడని కేసుపెట్టి, సెక్షన్ 120 కింద ఫిర్యాదు చేస్తాడు. దీనితో, నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న చందాన, ఈసారి పోలీసులు, నకుల్ నాయక్‌పై బెయిల్ కూడా పొందలేని దేశద్రోహ నేరం కింద, అదుపులోకి తీసు కుంటారు. అందరికీ కోర్ట్ కేసుల మేకులు కొట్టే నకుల్ నాయక్‌కి కూడా, అలానే ఒక స్వానుభవం ఎదురుపడటమే ఈ ‘మేకు’ కథ.

మనకి తెలుగులో, కథలు గురజాడకి ముందర రాసిన వారు ఉత్తరాంధ్రలో కూడా ఉన్నందువల్ల, ఏది మొదటి కథ అనే  చర్చ ఉన్నా, ఒడియా సాహిత్యంలో తొలి కథ రాసినది  ఫకీర్  మోహన్ సేనాపతి. 1898లో వీరు రాసిన కథ పేరు ‘రేబతి’. ఆడపిల్లలు చదువులు చదువుకోవచ్చా అన్నదీ, అలా ‘ఇంగ్లీష్ చదువులు చదువుకుంటే అరిష్టం ఇంటికి, ఊరికి’ అన్న మూఢ విశ్వాసం, ఆ రోజుల్లో ఉండేది. దీన్నే 1892లోనే తన కన్యాశుల్కం నాటకం రాస్తున్నప్పుడు, ఇదే కళింగాంధ్ర నుంచి, గురజాడ మొదటి అంకంలో కృష్ణరాయ పురం సీన్‌లో ఇంగ్లీష్ చదువుల వల్ల అంటువ్యాధులు వస్తా యన్న మాట  అగ్నిహోత్రావధాన్లు చేత అనిపిస్తాడు. (‘మన కి ఇంగ్లీష్ ఆచ్చిరాదని పోరిపోరి మొదటే చెప్పాను. మా పెత్తండ్రి దిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీషు చదువుకి పార్వ తీపురం పంపించేప్పటికి  వూష్ణం వచ్చి మూడు రోజుల్లో కొట్టివేసింది. బుచ్చబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెపిద్దామనుకుం టుండగానే పెద్ద ఖాయిలా పెట్టి చచ్చినంత పనైంది’).


ఫకీర్ మోహన్ కథలో ‘రేబతి’ పదేళ్ళ పిల్ల. చదువు కుంటూ ఉన్నది. ఇంటికి వచ్చి యువకుడైన మాస్టా రు పాఠాలు చెప్తూ ఉంటాడు. ఇది ఆ పిల్ల నానమ్మ కి ఇష్టం ఉండదు. తండ్రికి  కూతురు చదువు ఇష్ట మే. గ్రామస్తులు సరేసరి. ‘ఆడపిల్లకు చదువేమి టి, అరిష్ట దాయకం కాకపోతేనూ’ అని  మాట్లా డుకుంటూ ఉంటారు. ఊరిలో అంటువ్యాధి  కల రా వస్తుంది, మొదట తండ్రి, తల్లి చనిపోతారు.  తరువాత కొందరు గ్రామస్తులు బలవుతారు. నానమ్మ తన అభిప్రాయం మార్చుకోదు. వ్యాధి వ్యాపించి కొన్నాళ్ళకి మాస్టారు, ఈ బాలిక కూడా మరణిస్తారు. ఇది 1890ల నాటి ఆధునికత కోసం పెనుగులాడుతున్న భార తీయ గ్రామీణ ముఖచిత్రంగా ఫకీర్ మొహు న్ శక్తిమంతంగా చెప్తారు. అయితే, ఆ రేబతి  కథ  ఆలా ఉండగా,  మన గౌరహరి కూడా ఒక రేబతి కథ, అదే పేరుతో  రాశారు.  వీరి కథలో రేబతి,  అట్టడుగు కులాలలు చెందిన పిల్లగా చదువు విషయంలో వివక్షకు, అవమానానికి గురి అయి నా, తట్టుకుని నిలబడి, ఆమె,  చదువు పూర్తి చే సి, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అవుతుంది. తనకు ఆనాడు హాని చేయబోయిన వారే, పెద్ద కులాల వారే, ఒక  ప్రమాదం కేసులో  ఇరుక్కుని ప్రా ణాపాయంలో ఉండగా, వారిని కాపాడి, తనకు చదువు వల్ల కలిగిన వివేకం, విజ్ఞత, వికాసం ఎంతటివో  నిరూపణ చేస్తుంది.అదే యువతి పొందుతుంది. ఈమె ఈనాటి రేబతి. కళింగ కథానికలకు ఈ 23వ పుర స్కార  ప్రదాన సభ, జరగడం  కళింగాంధ్రకు గర్వకారణం. ఒక తూర్పు ప్రాంత భాష నుంచే పురస్కారానికి అర్హమైన రచయితకు, ఈ గౌరవం అందచేస్తున్న సంస్థకు తెలుగు సాహిత్య లోకం అభినందనలతో బాటు ఈ పురస్కార ప్రదా నం,మరింత బలమైన తెలుగు ఒడియా భాషాసాహిత్య బం ధాలకు దారులుతీస్తుందని ఆకాంక్షిస్తూ, తగు బాటలు వేస్తున్న చాగంటి తులసి కృషి, తపన, సాఫల్య తీరాలను చేరాలని ఆశిస్తున్నది. 

-రామతీర్థ 
98492 00385

 

English Title
katha kalinganiki Chaso Spurthi
Related News