అసెంబ్లీ రద్దు వరకే కేసీఆర్‌కు అధికారం

Updated By ManamThu, 09/06/2018 - 00:00
ts govt
  • ఆ తర్వాత అధికారాలన్నీ రాజ్యాంగ సంస్థలకే..

  • అసెంబ్లీ రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలే జరగాలా..?

imageహైదరాబాద్ : ప్రభుత్వం రద్దు చేసే వరకే సీఎం కేసీఆర్‌కు అధికారం ఉంటుందని, ఆ తర్వాత అధికారాలన్నీ రాజ్యాంగ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్ఫష్టం చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రా? వచ్చే ఏడాది ఎన్నికలా? అనేది రాజ్యాంగం ప్రకారం ఉంటుందన్నారు. అసెంబ్లీని రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలే జరగాలనే నిబంధన   ఏమీలేదని చెప్పారు. అసెంబ్లీ రద్దు చేశాక అన్ని తాను అనుకున్నట్లే జరుగుతుందని సీఎం భావిస్తున్నట్టున్నారని వ్యాఖ్యానించారు.

అందరి హక్కులు ఒక్కరి చేతుల్లో ఉండవన్న విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లాంటి వాళ్లనే తెలంగాణ ప్రజలు ఓడించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. సినీ నటి సత్యచౌదరి, టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు  బుధవారం హైదరాబాద్‌లో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయి బీజేపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నార ు.

English Title
KCR is authorized upto cancel the assembly
Related News