మళ్లీ గజ్వేల్ నుంచే కేసీఆర్...

Updated By ManamThu, 09/06/2018 - 16:22
KCR to contest from Gajwel Constituency In Assembly Election
KCR to contest from Gajwel Constituency In Assembly Election

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గజ్వేల్ నుంచే పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన మెదక్ జిల్లా గజ్వేల్ నుంచే పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా 2014సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా, గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు.

అయితే థర్డ్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకుంటున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికలోల కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు వెలుపడ్డాయి. చివరకూ గులాబీ అధినేత ఎక్కడ నుంచి పోటీకి దిగుతారనే దానిపై క్లారిటీ ఇవ్వడంతో ఇటువంటి ఊహాగానాలకు తెరపడిటనట్లు అయింది.

English Title
KCR to contest from Gajwel Constituency In Assembly Election
Related News