ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ దిశా నిర్దేశం.. 

Updated By ManamThu, 09/06/2018 - 20:34
KCR, Telangana Assembly elections, TRS MLA candidates, 105 MLA candidates, Election campaign

KCR, Telangana Assembly elections, TRS MLA candidates, 105 MLA candidates, Election campaignహైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం ముగిసింది. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి వారితో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులంతా ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. హుస్నాబాద్‌ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని తెలిపారు.

‘‘రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లండి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయండి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. టికెట్ వచ్చిందని గర్వపడొద్దు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిలో నేతలను కలుపుకొనిపోవాలి. ప్రతీ నియోజకవర్గంలోకి వస్తా. ఒక్కోరోజు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. అసంతృప్త నేతలుంటే మీరే బుజ్జగించాలి. ప్రతి నియోజకవర్గంలో ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. ప్రచారంలో అలసత్వం ప్రదర్శిస్తే నాకు సమాచారం వస్తుంది. మరో సమావేశంలో కలుద్దాం’’ అని అభ్యర్థులకు కేసీఆర్ సూచనలు చేశారు. 15 రోజుల తర్వాత జిల్లాల వారీగా కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 

English Title
KCR gives guidelines to TRS MLA candidates 
Related News