రాజ్‌నాథ్, జైట్లీతో ముగిసిన కేసీఆర్ భేటీ

Updated By ManamSun, 08/26/2018 - 17:17
Arun jaitley, KCR, Delhi tour, Rajnath singh, Bifucation law

Arun jaitley, KCR, Delhi tour, Rajnath singh, Bifucation lawన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం ముగిసింది. ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విభజన చట్టంలో ఇప్పటికి పెండింగ్‌లో ఉన్న అంశాలను రాజ్‌నాథ్‌తో చర్చించారు. హైకోర్టు విభజనతోపాటు రెవెన్యూ పంపకాలు, షెడ్యూల్ 9,10లోని సంస్థలోని విభజన, గోదావరి, కృష్ణ నీటి పంపకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక స్థాయి, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలపై రాజ్‌నాథ్‌తో కేసీఆర్ చర్చించారు.
Arun jaitley, KCR, Delhi tour, Rajnath singh, Bifucation lawగతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీకి ఇంటికి నేరుగా కేసీఆర్ వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. 15 నిమిషాలపాటు జైట్లీతో సమావేశం కొనసాగింది. ఈ చర్చలో ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంపు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదలపై జైట్లీతో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. 

English Title
KCR meeting end with Arun jaitley




Related News