రాజ్‌నాథ్, జైట్లీతో కేసీఆర్ భేటీ

Updated By ManamSun, 08/26/2018 - 16:34
KCR, Rajanth singh, Arun Jaitley, Delhi tour

KCR, Rajanth singh, Arun Jaitley, Delhi tourన్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన ఆదివారం కేంద్ర హోమంత్రితోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అదేవిధంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపైనా, కృష్ణా, గోదావరి నీటి పంపకాలపైనా కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రానికి ఆర్థికపరంగా అవసరమైన విషయాలతో పాటు నిధుల విడుదలపై జైట్లీతో సీఎం చర్చించినట్టు తెలిసింది. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. 

English Title
KCR meets Rajnath singh, Arun jaitley in New delhi
Related News