ప్రతిపక్షాలవి కాకిగోల...

Updated By ManamThu, 09/06/2018 - 16:07
cm kcr speech in telangana bhavan
telangana cm kcr speech in talangana bhavan

హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ అసహనం కనిపిస్తోందని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతరం ఆయన తొలిసారి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, అయితే రాష్ట్రంలో రాజకీయ అసహనం కనిపిస్తోందని, అది మంచిది కాదని అన్నారు.  

ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని, మైనర్ ఇరిగేషన్ పూర్తిగా ధ్వంసమైతే.. కాంగ్రెస్ సన్నాసులు పట్టించుకోలేదని విమర్శించారు. గత ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగం కోసం ఖర్చు చేసింది 25 వేల కోట్లు అని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో కమీషన్లు తీసుకున్నట్లు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శల్లో వాస్తవాలు లేవని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఒక సాక్ష్యం, ఆధారం లేకుండా ప్రతిపక్షాలు ఇష్టారీతిన విమర్శలు చేయడం సరి కాదని అన్నారు.

అలాగే ప్రతిపక్షాలవి కాకిగోల అన్న కేసీఆర్... రాష్ట్ర అభివృద్ధిపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.  ఈ నాలుగేళ్లలో తెలంగాణ ఆర్థిక ప్రగతి 17.17 శాతం అని, ఈ అయిదు నెలల్లో  రాష్ట్ర ప్రగతి 21.96 శాతం నమోదు అయిందన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఆగకూడదనే తాము ముందుకు సాగుతున్నామన్నారు.  దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని సాధించామని, తెలంగాణకు ఇప్పటివరకూ 40 అవార్డులు వచ్చాయని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

English Title
KCR Speech at Telangana Bhavan over assembly dissolution
Related News