'కేసీఆర్ మళ్లీ సీఎం'

Updated By ManamTue, 09/04/2018 - 21:20
KCR, CM, Telangana, Ramdas Athawale
  • రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు

KCR, CM, Telangana, Ramdas Athawaleహైదరాబాద్: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడం, మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అథవాలే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో మహిళల సంక్షేమం, పేదలకు, రైతులకు, దళితుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ చెబుతున్న తరుణంలో అథవాలే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.   

English Title
KCR will become CM for Telangana state again, says Ramdas Athawale
Related News