కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: డిప్యూటీ సీఎం

Updated By ManamMon, 09/10/2018 - 11:08
KE Krishnamurthy

KE Krishnamurthyహైదరాబాద్: ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన పాపంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి అని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోమని తెలిపారు. ఏపీకి మొండి చేయి చూపిన మోదీ నమ్మక ద్రోహి అని, ఏపీ విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రధాని ముఖ్యమంత్రి అపవాదు వేస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య గొడవ పెట్టేందుకు మోదీ సిద్ధమయ్యారని తూర్పారబట్టారు. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే సీపీఐతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకోనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English Title
KE Krishnamurthy about alliance with congress
Related News