మా రాష్ట్రంలో వరదలకు తమిళనాడే కారణం: కేరళ

Updated By ManamFri, 08/24/2018 - 08:59
Kerala

Keralaతిరువనంతపురం: గత కొద్ది రోజులుగా ప్రకృతి చేసిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కేరళ. మానవతప్పిదం వలనే కేరళలో ఇలా వరదలు వచ్చాయని పలువురు భావిస్తుండగా.. తమ రాష్ట్రంలో వరదలకు పక్కనున్న తమిళనాడే కారణమని కేరళ ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. తమ రాష్ట్రంలో ఉన్న ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని కేరళ పేర్కొంది. ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో తమ రాష్ట్రాన్ని వరద ముంచెత్తిందని కేరళ ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

అయితే తమిళనాడు ప్రజలకు నీటిని అందించాలన్న లక్ష్యంతో 150ఏళ్ల క్రితం ముళ్ల పెరియార్ ప్రాజెక్టును కేరళలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమిళనాడే చూసుకుంటోంది. అయితే ప్రాజెక్ట్ కట్టి చాలా సంవత్సరాలు అవుతుండటంతో దానిని కూల్చివేసి కొత్తది నిర్మించాలని కేరళ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. దీంతో పాటు డ్యామ్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 142 నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరింది. అయితే కేరళ విజ్ఞప్తిని తమిళనాడు పట్టించుకోలేదు. ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం వల్లే ఈ వరదలు ముంచెత్తాయని కేరళ ఆరోపిస్తోంది.

English Title
Kerala blames Tamilnadu for floods
Related News