కేరళకు పయనమైన ప్రధాని మోదీ

Updated By ManamFri, 08/17/2018 - 20:47
Kerala Flood: PM Narendra Modi To Visit Kerala Today For Survey

Kerala Flood Live Updates

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి కేరళకు పయనమయ్యారు. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వరదలకు వందాలాది మంది ప్రాణాలు పోయాయి. ఆస్తి నష్టం అయితే అంచానాలకు లెక్కలేనంత. ఇదీ గత కొద్దిరోజులుగా కేరళ పరిస్థితి. ఇప్పటికే రంగంలోకి ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.

శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కేరళకు బయల్దేరిన మోదీ.. ఇవాళ రాత్రికి తిరువునంతపురం చేరుకోనున్నారు. మొదట సీఎం పినరయితో పాటు పలువురు కీలకాధికారులతో ఆయన సమావేశమై పరిస్థితిపై సమీక్షిస్తారు. అనంతరం సీఎంతో కలిసి మోదీ కూడా ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. ఏరియల్ సర్వే అనంతరం 'జాతీయ విపత్తు'గా రాష్ట్రాన్ని ప్రకటించే అవకాశాలుండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కాగా గురువారం మధ్యాహ్నమే మోదీ కేరళకు వెళ్లాల్సి ఉండగా అదే రోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తుదిశ్వాస విడవడం.. ఆ మరుసటి రోజు అంత్యక్రియలు ఉండటంతో పర్యటన రెండ్రోజులు ఆలస్యమైంది.

English Title
Kerala floods: PM Modi to visit state today, review situation
Related News