ఆరోగ్యవంత రాష్ట్రాలివే..

Updated By ManamFri, 02/09/2018 - 19:11
representational

representationalన్యూఢిల్లీ: కొన్ని నెలల క్రితం గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు మృతి.. ఆ ఘటన జరిగి కొన్ని రోజులైనా కాకముందే మరో ఘటన. ఇలా ఉత్తర్‌ప్రదేశ్ తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. దాని ఫలితమో.. వైద్యుల నిర్లక్ష్యమో.. పరిశుభ్రత లేమో.. కారణాలేవో ఏమో గానీ.. ఆరోగ్య సూచిలో ఉత్తర్‌ప్రదేశ్ అత్యంత హీన స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక, అదే ఆరోగ్య సూచిలో కేరళ అత్యున్నత స్థానాన్ని అధిరోహించింది. చదువులో మేటి అనిపించుకున్న కేరళే.. ఆరోగ్యం విషయంలోనూ భేష్ అనిపించుకుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచి జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కేరళ తర్వాతి స్థానాల్లో పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌లు నిలిచాయి. ‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు.. పురోగామి భారత్: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకులపై నివేదిక’ పేరిట నీతి ఆయోగ్ ఈ వివరాలను వెల్లడించింది. ఇక, రాజస్థాన్, బిహార్, ఒడిసా రాష్ట్రాల్లో మాత్రం ఆరోగ్యం అంతంతేనని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఇక, గడిచిన ఏడాదితో పోలిస్తే పరిస్థితిని మెరుగుపడిన రాష్ట్రాల జాబితాలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్‌లు టాప్ మూడు స్థానాల్లో నిలిచాయి. నవజాత శిశు మరణాల రేట్ (ఎన్ఎంఆర్), ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల రేటు విషయంలో ఆయా రాష్ట్రాలు మెరుగైన పురోగతిని చూపించాయి. చిన్న రాష్ట్రాల విషయానికొస్తే మిజోరామ్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో మణిపూర్, గోవా నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్.. ఆరోగ్య విషయంలో టాప్‌లో ఉంది. ఇక, జూన్ నాటికి 730 జిల్లా ఆస్పత్రుల విషయాల గురించి చెప్పేస్తామని, ఏవి బాగా పనిచేస్తున్నాయి.. ఏవి చేయట్లేదన్న విషయాలను వెల్లడిస్తామని నీతి ఆయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్ తెలిపారు. 

English Title
Kerala Tops the Health Index
Related News