టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై కీలక నిర్ణయం..

Updated By ManamFri, 09/07/2018 - 18:58
Chandrababu naidu, TDP, Congress, Uttam kumar reddy 
  • రేపు హైదరాబాద్ రానున్న సీఎం చంద్రబాబు

  • ఉత్తమ్ ప్రతిపాదనపై టీటీడీపీలో చర్చ.. ఉత్తమ్‌కు రమణ ఫోన్.. 

Chandrababu naidu, TDP, Congress, Uttam kumar reddy హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై శనివారం కీలక నిర్ణయం వెల్లడి కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనపై తెలంగాణ టీడీపీలో చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి పొత్తు విషయమై చర్చిద్దామని చెప్పినట్టు తెలిసింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) హైదరాబాద్‌కు రానున్నట్టు తెలుస్తోంది. దాంతో చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో పొత్తులపై టీటీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. 

తెలంగాణలో పరిణామాలపై మంత్రులు, నేతలతో రేపు లేక్‌వ్యూలో ఉదయం 10.30 గంటల నుంచి ఉదయం 11.30 వరకు చంద్రబాబు చర్చ జరపనున్నారు. తెలంగాణలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని ఇప్పటికే చంద్రబాబు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ కార్యవర్గ భేటీ అయ్యే అవకాశం ఉంది. 
 

తెలంగాణలో కాంగ్రెస్‌దే ప్రభుత్వం: ఉత్తమ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలంగాణ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం వస్తోందన్నారు. ఈసీతో మాట్లాడి రద్దు చేశామని కేసీఆర్ చెబుతున్నారని, దుర్మార్గపు పాలన నుంచి విముక్తి పొందామని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

English Title
Key decision on TDP-congress alliance
Related News