ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తి

Updated By ManamSun, 09/23/2018 - 12:56
Khairatabad Ganesh Nimajjanam in Hyderabad
  • వేడుకగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

  • సప్తముఖ కాలసర్ప మహాగణపతికి వీడ్కోలు

  • గంగమ్మ ఒడిలో చేరిన ఖైరతాబాద్ గణపతి

Khairatabad Ganesh Nimajjanam in Hyderabad హైదరాబాద్ : గణపతి బప్పా మోరియా ఆదా లడ్డూ ఖాలియా... జై బోలో గణేష్ మహరాజ్ కీ జై... అంటూ భక్తుల నినాదాలు ఆకాశాన్ని అంటగా  ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు.  ట్యాంక్‌బండ్ హుస్సేన్ సాగర్‌లో గణనాథుడిని నిమజ్జనం చేసి పోయిరా గణపయ్య... పోయిరావయ్యా..! మమ్మేలు గణపయ్యా... అంటూ మహిళలు మంగళహారతలు ఇచ్చి గణపయ్యను సాగనంపారు. హుస్సేన్‌సాగర్‌పై ఏర్పాటు చేసిన ఆరో నంబర్‌ క్రేన్‌ వద్ద ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు  ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం చేశారు. నిమజ్జన సమయంలో భారీ గణపతిపై ఉత్సవ కమిటీ పూలవర్షం కురిపించింది.

Khairatabad Ganesh Nimajjanam in Hyderabad కాగా తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న  ఖైరతాబాద్  గణేషుడు శోభాయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ గణేషున్ని శనివారం రాత్రి 9.30 వరకే సమీప దర్శనానికి అనుమతించారు. అలాగే వినాయక విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌తో పాటు  రాజన్నబౌళి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట, షేక్‌పేట నాలా, సరూర్‌నగర్ చెరవు, సఫిల్‌గూడ, హస్మత్‌పేట చెరువులలో జరగనున్నాయి. విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వద్ద 51 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 16 క్రేన్లు, మినిస్టర్ రోడ్ వద్ద 3, రాజన్న బౌళి వద్ద 3, మీరాలం ట్యాంక్ వద్ద 2, ఎర్రకుంట వద్ద 2 క్రేన్లు అందుబాటులో ఉంచారు.

English Title
Khairatabad Ganapathi immersion-2018 completed
Related News