కీకీ చాలెంజ్.. వద్దు బాస్!

Updated By ManamFri, 07/27/2018 - 23:10
keekee
  • ప్రాణాంతకం అంటున్న పోలీసులు.. వైరల్‌గా మారుతున్న సరికొత్త చాలెంజ్

  • కారులోంచి వీడియో.. బయట డాన్సు.. కెమెరావైపు చూస్తూ రోడ్డుపై ప్రమాదాలు

  • కారులో ఉన్నవాళ్లకు కూడా ప్రమాదమే

ముంబై: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం మొదలవుతుందో చెప్పలేం. ఇప్పుడు సరికొత్తగా కీకీ / ఇన్ మై ఫీలింగ్స్ / షిగ్గీ చాలెంజ్ జనాన్ని వెర్రెక్కిస్తోంది. అది ఎప్పుడు, ఎక్కడ మొదలైందనేది తెలియడం లేదు గానీ, ఇప్పుడు ప్రపంచంలో యువత మొత్తం ఆ చాలెంజ్ చూసి గంగవెర్రులెత్తుతోంది. ఎలాగైనా దాన్ని పూర్తి చేయాలని భావిస్తూ.. ప్రమాదాల బారిన పడుతున్నారు. విదేశాల సంగతి ఏమో గానీ, మన దేశంలో రోడ్డు మీద పరిస్థితులకు ఈ చాలెంజ్ ఏమాత్రం సరిపోయేలా లేదు. 

image


ఏమిటీ చాలెంజ్?
కీకీ చాలెంజ్ అనేది ప్రాథమికంగా ఒక పాటకు డాన్సు చేయడం. అయితే, అది మామూలుగా అయితే కిక్కేముంటుంది? కదులుతున్న కారులోంచి తలుపు తీసుకుని కిందకు దిగుతారు. కారు మ్యూజిక్ ప్లేయర్ లోంచి డ్రేక్ పాడిన ఆల్బం.. ‘కీకీ డూ యూ లవ్ మీ.. ఆర్ యూ ఎవాయిడింగ్’ అనే పాట మోగుతుంటుంది. దానికి కింద ఉన్నవాళ్లు డాన్సు చేస్తూ ముందుకు కదులుతుంటారు. కారు కూడా నెమ్మదిగా కదులుతుంటుంది. కారు నడిపేవాళ్లు తమ ఫోన్లో దాన్ని వీడియో తీస్తారు. సరిగ్గా ఇదే ప్రమాదకరంగా మారుతోంది.

కింద డాన్సు చేసేవాళ్లు రోడ్డుమీద ఏముందో చూసుకునే అవకాశం ఉండదు.. అలాగే కారు నడిపేవాళ్లు కూడాimage ముందు చూసుకోరు. దానివల్ల అందరికీ ప్రమాదమేనని ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రేక్ పాడిన ‘ఇన్ మై ఫీలింగ్స్’ అనే ఆల్బం ఇంకా అధికారికంగా విడుదల కాకుండానే అందులో ఉన్న కీకీ.. డూ యూ లవ్ మీ అనే పాట ఈ చాలెంజ్ రూపంలో వైరల్‌గా మారి ప్రపంచం అంతటినీ ఊపేస్తోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా ముంబై పోలీసులు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. కారు నెమ్మదిగా కదులుతుండగా బయటికి వచ్చి డాన్సు చేస్తున్న యువకుడు ముందున్న కరెంటు స్తంభానికి తల తగిలి కింద పడిపోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇలా చాలామంది రకరకాల ప్రమాదాలకు గురైనట్లు ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో వస్తున్నా, ఈ చాలెంజ్ విషయంలో యువత మాత్రం వెనకడుగు వేయడం లేదు.

 కొంతమంది కారుతో వేరే వాళ్లను ఢీకొట్టగా, ముందు ఆగి ఉన్న పెద్ద వాహనాలను ఢీకొన్న వైనాలు కూడా ఉన్నాయి. కొంతమంది కారు నెమ్మదిగా పోనివ్వలేక ఉన్నట్టుండి వేగం పుంజుకుని ప్రమాదాల బారిన పడ్డారు. అందుకే కీకీ చాలెంజ్ వైపు పోవద్దని ముంబై పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. 

English Title
Kiki Challenge .. dont try
Related News