కిరాక్ పుట్టించేలా.. 'కిరాక్ పార్టీ' ట్రైల‌ర్‌

Updated By ManamTue, 03/13/2018 - 20:51
kirrak

kirrak partyనిఖిల్ హీరోగా న‌టించిన తాజా చిత్రం 'కిరాక్ పార్టీ'. క‌న్న‌డంలో విజ‌యం సాధించిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సిమ్రాన్ ప‌రీంజా, సంయుక్తా హెగ్డే హీరోయిన్లుగా న‌టించారు. శ‌ర‌న్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్‌ను ఈ రోజు (మంగ‌ళ‌వారం) విడుద‌ల చేశారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ ట్రైల‌ర్‌లో నిఖిల్ రెండు లుక్స్‌లో క‌నిపిస్తున్నారు. ట్రైల‌ర్ ప్ర‌కారం.. ఇందులో నిఖిల్ మెకానిక‌ల్ ఇంజినీర్ స్టూడెంట్ అని అర్థ‌మ‌వుతోంది. ఫ‌స్ట్ రెబ‌ల్‌, ఫ‌స్ట్ ఫైట్‌, ఫ‌స్ట్ ప‌ఫ్‌, ఫ‌స్ట్ డ్రింక్‌.. అంటూ కొన్ని షాట్స్ వేసి ఆ క్యారెక్ట‌ర్‌పై ఆస‌క్తిని క్రియేట్ చేశారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న‌ ఈ చిత్రం నిఖిల్‌కు మ‌రో విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

English Title
'kirrak party' trailer is here
Related News