యాక్టింగ్ రాదు.. రాజకీయంగా పనికిరాడు

Updated By ManamTue, 02/13/2018 - 15:27
Kishan, Pawan

Kishan Reddy, Pawan kalyanసినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు నటనే సరిగా రాదని బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా పవన్ పనికిరారని ఆయన అన్నారు. పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తుందని.. తన అన్న చిరంజీవిని అడ్డుపెట్టుకుని అతడు సినిమా స్టార్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు కూడా మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడు అవుదామనుకుంటుంన్నాడని విమర్శించారు. అంతేకాకుండా పవన్ కన్నా అతడి అన్న కుమారుడే మంచి నటుడని వ్యాఖ్యానించారు. కత్తి మహేశ్ లాంటి వాళ్లను మీడియానే పైకి లేపిందని ఆయన చెప్పారు.

English Title
Kishan Reddy comments on pawan Kalyan
Related News