జానారెడ్డిపై చర్యలు దురదృష్టకరం: కిషన్ రెడ్డి

Updated By ManamTue, 03/13/2018 - 11:56
Kishan Reddy

Kishan Reddy హైదరాబాద్: అసెంబ్లీలో సోమవారం జరిగిన సంఘటన దురదృష్టకరమని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో వీటికి స్థానం లేదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేముందు ప్రతిపక్ష సభ్యుల్ని పిలిచి మాట్లాడితే బాగుండేదని అన్నారు. అయితే ఆందోళనకు సంబంధం లేని జానారెడ్డిపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జానారెడ్డి ప్రవర్తన, హుందాతనాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందని, ప్రతిపక్ష నాయకుడిని సస్పెండ్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. అసహనం ప్రతిపక్షాలది కాదని, ప్రభుత్వానిదని.. ప్రభుత్వానికి ఇంత అసహనం పనికిరాదని తెలిపారు.

English Title
Kishan Reddy on Congress MLAs suspension
Related News