గులాబీ గూటికి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి?

Updated By ManamWed, 03/07/2018 - 19:47
kishan reddy

Kishan Reddyబీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గులాబీ గూటికి చేరనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఉద్యమ కాలంలో తెలంగాణలో బీజేపీకి ఓ ఊపు తీసుకురావడంలో కిషన్ రెడ్డి శ్రమ ఎంతో ఉంది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో బీజేపీ ప్రభ మసకబారుతోంది. జాతీయ స్థాయి నాయకత్వం కూడా తగిన గుర్తింపు ఇవ్వకపోవడం పట్ల కిషన్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇక బీజేపీ పుంజుకునే అవకాశాలు లేదని నిర్ణయానికి వచ్చిన కిషన్ రెడ్డి...ఇంతకాలం నమ్ముకున్న బీజేపీని వీడి కారెక్కడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్‌లో చేరితే రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని భావిస్తున్న కిషన్...అందుకు సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తన క్యాడర్‌తో భారీ ఎత్తున టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

English Title
kishan reddy to join in BJP
Related News