విశ్వాసాల నీలినీడల్లో విజ్ఞానం

Updated By ManamThu, 03/22/2018 - 08:20
image

imageశాస్త్రీయ దృక్పథం కోల్పోయే కొద్దీ ఒకానొక స మాజం భరించలేని అభివృద్ధి నిరోధకత్వంలోకి జారి పోతుంది. నేడు అలాంటి పరిస్థితులు దేశంలో వేగం గా నెలకొంటున్నాయి. నిరూపిత శాస్త్రీయ సిద్ధాంతా లకు తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు ఆధారాలు ఇచ్చేందుకు జరిగే ప్రయత్నాల వల్ల ఆయా శాస్త్ర విష యాలకు ఏమీ హాని జరగదు కానీ, అలాంటి అని ర్ధారిత విషయాలను అలవోకగా పాలకులు ప్రచారం చేస్తుండడం వల్ల విజ్ఞాన శాస్త్రాలతో పరిచయంలేని ప్రజల మనుషుల్లో అనేక అనుమానిత బీజాలు తప్ప క నాటుకుంటాయి.  ప్రజల కుల, మత, జాతి తది తర అస్తిత్వ భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు, ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ పోటీపడి తరతమ స్థాయి ల్లో చేస్తున్నవే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాచీ న భారతంలో ‘ప్లాస్టిక్ సర్జరీ’ ప్రతిభ గురించి ఘనం గా కీర్తించడంతో ప్రారంభమై, డార్విన్ పరిణామ వాదం అశాస్త్రీయమంటూ  ఉన్నత విద్యాశాఖ మంత్రి సత్యపాల్ సింగ్ తప్పుపట్టడం,  నేడు శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ ఐన్‌స్టీన్ ద్రవ్య-శక్తి సమీకరణ ఉ=కఇ2 కంటె గొప్ప సిద్ధాంతాలు వేదాల్లో ఉ న్నాయని 10వ భారత వైజ్ఞానిక కాంగ్రెస్‌లో చెప్ప డం... ఇలా ఎన్నో ప్రకటనలు శాస్త్రీయ దృక్పథం గల ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. భారత రాజ కీయ వర్గాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై అశాస్త్రీయ మైన అపోహలను ప్రచారం చేయడం ద్వారా సాధా రణ ప్రజానీకంలో అభివృద్ధి నిరోధక ఉద్వేగ వైష మ్యాలు రెచ్చగొట్టడం ఆందోళన కలిగిస్తోంది.

పాలకుల నిర్లక్ష్య ప్రచారం
గణేశ్‌కు ఏనుగు తల అతికించిన (హెడ్ ట్రాన్స్ ప్లాంటేషన్), గోవుల నుంచి ఆక్సిజన్ విడుదల కావడం, నెమళ్ళ పాతివ్రత్యం గురించి గొప్పలు చెప్ప డం తదితర అనేక అశాస్త్రీయ నమ్మకాలను పాలకులు నిర్లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఏ శాస్త్రాన్నైనా, శాస్త్రీ య సిద్ధాంతాన్ని, నియమాలను ప్రశ్నించడం తప్పు కాదు, అయితే ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలను పాటించకుండా ప్రశ్నించడం తీవ్ర తప్పిదమవుతుంది. శాస్త్రీయ అధ్యయనం లేకుండా ప్రశ్నించే హక్కు ఉండ దని ఒక తత్వవేత్త వ్యాఖ్యానించారు. ప్రతి వైజ్ఞానిక సిద్ధాంతం ప్రామాణికతను ప్రశ్నించాలి, నిరూపితమవుతుందో లేదో పరిశీలించాలి. అందుకు శాస్త్రీయ దృక్పథ ప్రమాణాలు పాటించకుండా వ్యక్తిగత విశ్వా సాలు, మత భావోద్వేగాలు, సాంస్కృతిక పిడివా దంతో  ప్రశ్నించడం ఘోర తప్పిదమవుతుంది. కొత్త సమాచారం ఆధారంగా రూపొందే మరింత సంక్లిష్ట సిద్ధాంతాలు పాత వాటిని పూర్వపక్షం చేస్తాయి. దాన్ని సాకుగా తీసుకొని విజ్ఞాన శాస్త్రాల ప్రామాణికతను, వి శ్వసనీయతను తప్పుపట్టి మత, జాతి భావోద్వేగాలు ప్రజల్లో రెచ్చగొట్టడం తప్పు. విజ్ఞాన శాస్త్రాల్లోని సి ద్ధాంతాలన్నీ మరింత పరీక్షలకు గురై, మరింత సంక్లి ష్టమైన, మరింత స్పష్టమైన ఉన్నతస్థాయి సిద్ధాం తాలకు చోటివ్వక తప్పదు. అంతమాత్రాన నూతన సిద్ధాంతాలన్నీ ఆకాశం నుంచో లేదా బ్రహ్మముఖం నుంచో ఊడిపడవు. పాత సిద్ధాంతాల భుజాలపై నుం చి ఎదిగివచ్చినవే.  ప్రతి పాత సిద్ధాంతం కొత్త దానికి చోటిచ్చి తప్పుకోవలసిన అనివార్య చారిత్రకాభివృద్ధి క్రమాన్ని తప్పుగా నిర్వచించి శాస్త్రాలు బోధించే విష యాలు సత్యాలు కావని, వేదప్రామాణికతే శాశ్వత సత్యమని ప్రచారం చేసి ప్రజల్ని తప్పు దారి పట్టిం చడం తగదు. విజ్ఞానశాస్త్ర సిద్ధాంతాలు ప్రపంచం (ప్రకృతి+సమాజం) గురించిన అంతస్సారాన్ని, అంత ర్గత చలన నియమాలను వెలికితీస్తూ నిరంతర సత్యా న్వేషణలో అనంత పాక్షిక సత్యాల దశలను దాటు కుంటూ పరమ సత్యం వైపు నిరంతరాయంగా ప్ర     యాణిస్తాయి. ఉనికిలో ఉన్న ప్రతి పాక్షికసత్యం, తదనంతరం కొత్తగా ఉనికిలోకి వచ్చే మరొక పాక్షిక సత్యం ద్వారా పూర్వపక్షమవడం అంటే పాత పాక్షిక సత్యం అసత్యమని కాదు, అవాస్తవమని మాత్రమే అర్థం చేసుకోవాలి. అట్లని పాక్షిక సత్యాల దారి వెంట ఎప్పటికీ చేరుకోలేని పరమ సత్యం వెంట అన్వేష ణలు సాగించడమంటే ఎండమావిలో నీటికోసం వెత కడమనే నిరర్థక సత్యాన్వేషణగా భ్రమపడకూడదు. పరమ సత్యంకోసం చేసే అనంత అన్వేషణ గణిత శా స్త్ర సంకేతాలులాగా ఎలాంటి అవధులులేని శుద్ధ అ నంతం, నిరంతరాయత కాదు. అవధుల్లేని అనంతం ‘దుష్ట అనంతం’ ( bad infinity )గా, అర్థరహిత మైనదిగా పరిగణించాలి. ఉనికిలో ఉన్న అంశాలనే మరింత మెరుగైన మరింత సంక్లిష్టమైన, మరింత లోతుగా అర్థం చేయించే రూపంలో ఉన్నత స్థాయిలో పునరావృత్తమవుతూ కొనసాగుతుందని గుర్తించడం ‘యుక్త అనంతం’( good infinity )గాను, గతంతో పో లిస్తే ‘మరింత లోతైన పరమసత్యం’గాను గుర్తించాలి. ఈ భావనను ప్రజలకు అర్థమయ్యే భావజాలంగా మలచగలిగితే, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి క్రమం  సక్రమంగా అర్థమవుతుంది. లేకపోతే ఒక శాస్త్రీయ అధ్యయనం ‘కాఫీ’ మంచిదని నిర్ధారిస్తే, అదే సమయంలో మరొక అధ్యయనం ‘కాఫీ’ మానవ జాతికి వినాశకరమని చెబుతుండడంతో ప్రజలు తరచూ తీ వ్ర గందరగోళానికి గురవుతున్నారు.
 
అభివృద్ధి నిరోధక భావజాలం
ఇలాంటి అవకతవకలను ఆధారం చేసుకొని ప్రజలను మతతత్వ, అభివృద్ధి నిరోధక భావజాల వ్యసనానికి గురిచేసేలా ఆధిపత్య వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ కారణంగా శాస్త్రీయ దృక్పథాన్ని ని రంతరాయంగా అలవర్చుకోవాల్సిన సమాజం క్రమం గా వ్యక్తిగత విశ్వాసాలు, ఉద్వేగాలు ప్రజాభి ప్రాయంగా స్థిరపడుతున్న సత్యానంతర కాలంలోకి చేరుకుంది. సత్యానంతర రాజకీయాలతో అంటగా గుతున్న అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుల కోసం ప్రజల మధ్య అస్తిత్వ వైష మ్యాలను రెచ్చగొడుతున్నారు. మెజారిటీ మతస్తు లను ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ పేరు మీద బీజేపీ సంఘటితం చేస్తుంటే, మైనారిటీ మతస్తులు సహా హిందూ మతంలో అంతర్భాగమైన లింగాయత్ మైనారిటీ మతశాఖీయులను, వివిధ కుల సమూ హాలను కాంగ్రెస్ సంఘటితం చేస్తోంది. అదే సమయంలో హిందూ మతం సమాజాన్ని వివిధ శకల ప్రజాసమూహాలుగా నిర్వచించడంతో ఏర్పడిన కులసంఘాలను వామపక్షాలు సహా వివిధ లౌకిక శక్తులు కూడా ఏర్పరుస్తున్నాయి. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ భారత దేశ సామాజిక ప్రత్యేకతల పేరుతో పాలకవర్గ పార్టీలు, వామపక్ష, లౌకికవాద పార్టీలు పోటీపడి మతతత్వ, మతంలో అంతర్భా గంగా ఉన్న కులతత్వ భావోద్వేగాలను రెచ్చగొ డుతున్నట్టే లెక్క. 

వైజ్ఞానిక అభివృద్ధికి తప్పుడు మేధో ఆలోచనా ధోరణి ప్రధాన అడ్డంకిగా నిలుస్తుంది. భారతీయ ప్ర జానీకం ప్రధానంగా మతవిశ్వాసాల పునాదిగా గల భావోద్వేగాలపై జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ కీయాధిపత్యం కోసం విజ్ఞాన శాస్త్రాల ప్రామాణికతను ప్రశ్నిస్తూ, తప్పుడు శాస్త్ర చరిత్రను ఉద్వేగాల పునా దిపై ప్రచారం చేయడం సామాజిక వైషమ్యాలు పరా కాష్ఠకు చేరుకోవడానికి దారితీస్తుంది. రాజకీయ ఆధి పత్య లక్ష్యాలకోసం ప్రజల భావోద్వేగాలను వాడు కోవడం ప్రపంచవ్యాప్తంగా పాలకుల నైజం. 

మితవాద విశ్వరూపం
సమాజంలోని ప్రజల వైజ్ఞానిక స్ఫూర్తిస్థాయిని బట్టి రాజకీయపక్షాలు ఆ మేరకు విద్వేష రాజకీయాల కోసం అశాస్త్రీయ మత, సాంస్కృతిక విషయాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేసేందుకు సాహసిస్తాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఫాసిస్టు, అర్థ ఫాసిస్టు, ఫాసిస్టు ధోరణులు గల ప్రభుత్వాలు విజ్ఞాన శాస్త్ర విషయాలపై తీవ్రంగా దాడి చేస్తున్నాయి. వాతావరణ మార్పు వంటి భౌగోళిక సవాళ్ళను, అంత ర్జాతీయం చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను సైతం తప్పుడు అధ్యయనాలుగా వారు తృణీకరిస్త్తున్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోగల రాజ్యాలు ఏర్పడితే గానీ, కార్పొరేట్ అనుకూల ఆర్థిక ఎజెం డాను అమలు చేయడం సాధ్యంకాదు. అందుకు ఆర్థిక వికాసకాలంలో ప్రజాస్వామిక ముసుగుతో ఉన్న సెంట్రిస్ట్ (మధ్యేమార్గం) ప్రభుత్వాలు చాలా కీలక పాత్ర నిర్వహించాయి. సంక్షోభం తీవ్రతరమయ్యే కొ ద్దీ మధ్యేమార్గ ప్రభుత్వాలు ఎలాంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు తీసుకోలేకపోవడమే కాక, దిగ జారుతున్న ప్రజల జీవన ప్రమాణాలను, సాధారణ పాలనను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడు తుంది.

అస్తవ్యస్తమైన సాధారణ పాలన, ఆర్థిక వ్యవ స్థను చక్కదిద్ది కార్పొరేట్ వాణిజ్య కార్యకలాపం సజావుగా సాగాలంటే, ప్రజామోదం పొంది, డబ్ల్యూటీవో ఆర్థిక విధానాలను కచ్చితంగా, కఠినంగా అమలు చేయగల సత్తా ఉన్నా పార్టీ అధికారంలోకి రావలసి ఉంటుంది. ఆ కారణంగా మి(మ)త వాద భావజాల సంస్థలకు, రాజకీయ పక్షాలకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తుల నుంచి అమిత ప్రోత్సాహం లభించి అమెరికాలో ట్రంప్, భారత్‌లో నరేంద్రమోదీ సహా అనేక దేశాల్లో మితవాద పార్టీలు అధికారంలోకి వచ్చా యి. ప్రపంచార్థిక సంక్షోభం పరిష్కారమయ్యే దాకా దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల్ని నెర వేర్చే విధానాలు అమలు కావాలంటే ఒక క్రమశిక్షణ కలిగిన మితవాద పార్టీ అధికారంలో సుస్థిరంగా కొన సాగాలి. ఈ రహస్య హిందుత్వ ఎజెండాతో మెజారిటీ సమూహాన్ని సంఘటితం చేసి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు గో రక్షక దళాలు వంటి సమూహాల విధ్వంస/మారణకాండలకు అధికార పక్షం పరోక్ష/ ప్రత్యక్ష ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో కల్బుర్గి, గౌరీ లంకేష్ వంటి సామాజిక ఉద్యమ కారులను హత్యలకు గురిచేస్తున్నారు.

గతంలో అల్బర్ట్ ఐన్‌స్టీన్‌పై హిట్లర్ సారథ్యంలోని నోబెల్ పురస్కార గ్రహీతలైన ఫిలిప్ లెనార్డ్, జోహె న్నెస్ స్టార్క్ వంటి శాస్త్రవేత్తలు అర్థరహితమైన విమర్శ లు చేపట్టారు. అలాంటి వాతావరణాన్ని భారత పాల కులు నేడు పనిగట్టుకుని సృష్టించేందుకు పలు వైజ్ఞా నిక సిద్ధాంతాలను పురాణాల ఆధారంగాను, వేద ప్ర మాణాలతోనూ తీవ్రంగా విమర్శిస్తూ సాధారణ ప్రజ ల్లో మత భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ‘ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ ఆన్ వేదాస్’ అనే వెబ్‌సైట్‌లో స్టీఫెన్ హకింగ్ పేరుతో నడుస్తున్న తప్పు డు ఫేస్‌బుక్ పేజీ నుంచి తీసుకొని వండివార్చిన కథనం ఆధారంగా ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి మించిన ద్రవ్య శక్తి సిద్ధాంతం వేదాల్లో ఉన్నాయని హాకింగ్ అభిప్రాయపడుతున్నట్లు వ్యాసం ప్రచురితమైంది. దాన్ని ఉటంకిస్తూ, ఇతరత్రా ఎలాంటి అధ్యయనం లేకుండా, తమ హిందుత్వ రాజకీయాలకు సారూప్యత ఉన్న కారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఉటంకించడం హేతు విరుద్ధం. ఇందుకు ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు తప్పుడు అశాస్త్రీయ భావాలను ప్రచారం చేసేందుకు కీలక మాధ్యమాలుగా అవతరిం చాయి. అశాస్త్రీయ, కుల, మత, జాత్యహంకార భావాలు ఇంటర్‌నెట్ పునాదిగా నేడు అతి తక్కువ కాలంలో విద్యావంతులను ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవికతకు, వస్తుగత అంశాల పునాదిగా రూపొం దించిన సమాచారానికి బదులు వ్యక్తిగత విశ్వాసాలు, భావోద్వేగాలు, అశాస్త్రీయ భావాలు అంతర్జాతీయ సమాజంలోని ప్రతి జీవనరంగంలో పెను తుఫానులా ఆవరించి రాజ్యమేలుతున్న తరుణంలో శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథంతో ప్రజా ఉద్యమాలు దీప స్తంభాల్లా, దిక్సూచుల్లా దృఢంగా ముందుకు సాగాలి. 

 - వెన్నెలకంటి రామారావు

Tags
English Title
Knowledge in the blue waters of faith
Related News