కోహ్లీ గ్రేట్ రికార్డు

Updated By ManamWed, 05/16/2018 - 02:39
kohli

ముంబై: బెంగళూరు కెప్టెన్  కోహ్లీ  ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యంkohli కానీ రికార్డును సాధించాడు.   ఐపీ ఎల్‌లో ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు.  టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఈ సీజన్‌లో అతడి పరుగుల సంఖ్య 514కి చేరింది. 2011 సీజన్‌లో కోహ్లీ మొదటిసారి 557 (16 మ్యాచ్‌లు) పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2013లో 634 (16 మ్యాచ్‌లు), 2015లో 505 (16 మ్యాచ్‌లు), 2016లో 973 (16 మ్యాచ్‌లు) పరుగులు చేశాడు. ఈ సీజన్‌కు ముందు కోహ్లీతో పాటు డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) నాలుగుసార్లు 500కు పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ప్రతి సీజన్లోనూ 300కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడికి నిలిచాడు. రైనా 2010, 2013, 2014లో 500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ సీజన్లో లీగ్ దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.

English Title
kohli great record
Related News