బడా నిర్మాతతో ఆర్‌ఎక్స్ 100 హీరో 

Updated By ManamThu, 09/20/2018 - 14:23
Karthikeya

Karthikeya‘ఆర్‌ఎక్స్100’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యువ హీరో కార్తికేయ మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. కొత్త దర్శకుడు టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ ఓ చిత్రంలో నటిస్తుండగా.. అందుకోసం డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. హిప్పి అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కళైపులి ఎస్ థాను నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళ బైలింగ్వల్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

 

English Title
Kollywood top producer producing RX 100 Hero next movie Hippi
Related News