‘ఎంపీగా ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తా’

Updated By ManamTue, 02/13/2018 - 16:37
komati reddy

komati reddyనల్గొండ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రాక్షస పాలన కొనసాగుతుందని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పానగల్‌లో పర్యటించిన ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న మంత్రి జగదీష్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ దక్కదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు నల్గొండ నుంచి నడుం బిగించామని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీలు, పన్నెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచి సోనియాకు కానుకగా ఇస్తామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ఎమ్మెల్యేగా యువకునికి అవకాశం ఇస్తామని ఆయన చెప్పడం విశేషం. తమ ప్రభుత్వంలో బొడ్డుపల్లి లక్ష్మి ఎమ్మెల్సీగా పని చేస్తారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం తిన్న ప్రజల సొమ్ము ప్రతి పైసా కక్కిస్తామని కోమటిరెడ్డి చెప్పారు. నల్గొండ ఎంపీగా ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఆయన చెప్పారు. పిల్లికి బిచ్చం వేయని వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి అని, అందరిని కలుపుకుని పోయే వ్యక్తి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

English Title
komati reddy speech in nalgonda district
Related News