దీక్షకు దిగిన కోమటిరెడ్డి, సంపత్

Updated By ManamTue, 03/13/2018 - 19:33
komatireddy
komatireddy venkat reddy

హైదరాబాద్: తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు 48 గంటల దీక్ష చేపట్టారు. గాంధీభవన్ వేదికగా ప్రజాస్వామిక -పరిరక్షణ దీక్ష పేరిట ఈ దీక్షకు మంగళవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 48 గంటల పాటు వారు దీక్ష కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.

Read Related Article: అఖిలపక్షానికి వీడియోలు చూపండి..

Read Related Article:స్వామిగౌడ్‌కు కొనసాగుతున్న చికిత్స

తెలంగాణ అసెంబ్లీలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ దాడి ఘటనకు సంబంధించి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తిగా సభ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. జానారెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్‌లపై సస్పెన్షన్‌ వేటు వేయగా...కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలు రద్దు చేశారు.

English Title
komatireddy, sampath kumar starts 48 hrs hunger strike
Related News