మేం చేసిన తప్పేంటి?: కొండా సురేఖ

Updated By ManamSat, 09/08/2018 - 11:49
Konda Surekha Press Meet in somajiguda press club
  • టీఆర్ఎస్‌పై కొండా దంపతులు అసంతృప్తి

  • బీసీ మహిళగా నన్ను అవమానించారు

  • పార్టీ నిర్ణయాలకు కట్టుబడే పనిచేశాం

  • టికెట్ ఇవ్వకపోవడానికి కారణమేంటి?

  • పొమ్మనలేక పొగ పెట్టారు...

konda surekha press meet

హైదరాబాద్ : ‘టీఆర్ఎస్ తొలి జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని కొండా సురేఖ అన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను చేసిన తప్పు ఏంటో చెప్పాలని కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీసీ మహిళను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  జాబితాలో నా పేరు లేకపోవడం తనను అవమానించడమే అని అన్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా టీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది. 

పరకాల సీటు అడిగితే వరంగల్ ఈస్ట్ నుంచే పోటీ చేయమని కేసీఆర్ అన్నారు. ఆయన మాట మేరకు అక్కడ నుంచి 56వేల భారీ మెజార్టీతో గెలిచాను. పార్టీ నుంచి రూపాయి తీసుకోకుండా వరంగల్ ఈస్ట్ నుంచి విజయం సాధించాను. నాకు మంత్రి పదవి, మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని గతంలో కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ మాట తప్పారు. 

కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మా సొంత ఖర్చుతో అభ్యర్థులను గెలిపించాం. నాలుగుసార్లు ఓటమి లేకుండా గెలిచాను. అయినా నాకు సీటు ఇవ్వకపోవడానికి నన్ను అవమానించినట్లే. మహిళలు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని కొండా సురేఖ సూటిగా ప్రశ్నించారు. ఉద్యమంలో పాలుపంచుకున్న మహిళలకు సరైన స్థానం కల్పించడంలో టీఆర్ఎస్ విఫలం అయింది.

పార్టీకి మేం చేసిన తప్పంటి?. అన్ని భరిస్తూ సాధారణ కార్యకర్తగా పార్టీ అభివృద్ధి కోసం పని చేశాం. అయినా నేను ఏ రోజు క్రమశిక్షణ తప్పలేదు.  టీడీపీ నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారు.  ప్రజల్లో ఉండి పార్టీ కోసం పనిచేసిన మాకు టికెట్ ఎందుకు ఆపాల్సి వచ్చింది.‘ అని ప్రశ్నలు సంధించారు.

English Title
Konda Surekha Press Meet in somajiguda press club
Related News