అంజన్న సన్నిధిలో తీవ్ర విషాదం

Updated By ManamTue, 09/11/2018 - 13:52
Kondagattu bus accident: 45 dead, 28 injured in Telangana
  • కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

  • ఆర్టీసీ బస్సు బోల్తా, 45మందికి పైగా మృతి

  • పెరుగుతున్న మృతుల సంఖ్య

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • రాంసాగర్ నుంచి జగిత్యాల వెళుతుండగా ప్రమాదం

Kondagattu bus accident: 40 dead, 28 injured in Telangana

కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 40మందికి పైగా మృతి చెందారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే 26మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 21మంది మహిళలు, 20మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా జిగిత్యాల జిల్లాకు చెందినవారే.

తీవ్రంగా గాయపడినవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఘ‌ట‌నాస్థ‌లంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 70మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమచారం. కాగా శనివారంపేట నుంచి  ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి రాంనగర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 
Bus accident at Kondagattu Ghat Road

English Title
Kondagattu bus accident: 45 dead, 28 injured in Telangana
Related News