‘కోనేరు’ సిఫారసులే‘మాయె’!

Updated By ManamSat, 09/22/2018 - 01:13
editorial

imageదాదాపు పద్నాలుగేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూసమస్యలు లేని రాష్ట్రంగా చేసేందుకు,  ప్రతి ఒక్క నిరు పేదకు ముఖ్యంగా దళిత, గిరిజన కుటుంబాల వారికి సొంత భూమి కలను తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి 2004 ఏప్రిల్‌లో అప్పటి మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావు అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన భూ కమిటీని వేశారు. అధిక మొత్తాలలో ఆర్ధిక వనరులను సమకూర్చారు. ఈ కమిటీ 24 జిల్లాలోనూ విరివిగా రెండేళ్ళ పాటు తిరిగి పలు ప్రజాసంఘాల ప్రతినిధులను, సంస్థలను, అధికా రులను, ఆయా శాఖలను కలిసింది. ప్రభుత్వ భూములపై విస్తృతంగా సర్వే చేసింది. ఏఏ శాఖల కింద ప్రభుత్వం ఆధీనం లో ఎంతెంత భూమి నిరూపయోగంగా ఉందో కూడా లెక్కలు కట్టింది. ఇప్పటివరకూ పంపిణీ చేసిన భూములు సైతం అన్యా క్రాంతం కాకుండా, ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికీ ఎకరం భూమి పంచి ఇవ్వడానికి అవకాశం ఉందని కూడా అభి ప్రాయ పడింది. 18 రకాల భూములను గుర్తించి 2006 డిసెం బర్ 28వ తేదీన 104 సిఫారుసులతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

కోనేరు కమిటీ సిఫారుసులలో ముఖ్యమైన అంశాలు. 1. అసైన్డ్‌మెంట్ భూముల కేటాయింపు: వీటికి సంబంధించి కమి టీ 12 సిఫారుసులను చేసింది. చట్టవిరుద్ధంగా డి ఫారమ్ పట్టా పొందిన వ్యక్తి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూములను భూమిలేని నిరుపేదల నుంచి దరఖాస్తు వచ్చిన 3 నెలలోపు వారికి కేటాయించాలి. అసైన్డ్ భూములను గ్రామసభ తప్పనిసరిగా ఆమోదించాలి. అసైన్డ్ భూములను అన్యాక్రాం తం చేసుకున్నవారు ఎంత కాలంగా సాగు చేసుకుంటున్నారో,  ఎంత ఆదాయం పొందారో లెక్కలు కట్టి రెట్టింపు మొత్తం వారి నుంచి రాబట్టాలి. అసైన్డ్ భూములను అన్యాక్రాంతం నుంచి కాపాడటానికి వారికిచ్చే పట్టాలపై అన్యాక్రాంతం చేయడం నిషేధం అని ముద్రించాలి. అసైన్డ్‌దారులందరికీ ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్‌లు ఇవ్వాలి. ఇలాచేస్తే అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆపవచ్చు అని అభిప్రాయపడింది. 2. భూహక్కుల నిర్దారణ పుస్తకం: బినామీ పేర్ల మీద భూములను అనుభవిస్తున్నవారికి  ఆ భూమి వారికి ఎలా సంక్రమించిందనే సమాచారం రెవెన్యూ రికార్డులలో లే దు. అనుబంధ పత్రాలు కూడా అందుబాటులో లేవు. అటువంటి భూముల విషయంలో గ్రామ పెద్దలు, ఆయా భూముల చుట్టూ ఉన్న రైతుల నుంచి సమాచారం రాబట్టాలి. 

విశ్వసనీ యమైన హక్కు ఉన్నదని నిర్ధారణకు వచ్చినప్పుడు చిన్న, సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి. 3. కౌలుదారులకు రక్షణ : కౌలు విధానం ఒక ప్రత్యేకమైన సమస్య. కౌలుదారులు నమోదు కాకపోవటం వలన ప్రభుత్వ పథకాలను, బ్యాంకు రుణాలను కౌలుదారులు పొందలేకపోతున్న పరిస్థితి. వీరు సంస్థాగత రుణాలు పొందటానికి రుణ అర్హత కార్డులు మంజూరు చేయా లి. ఇదే సమయంలో కౌలునమోదైతే, తన భూమిని కోల్పోవా ల్సి వస్తుందనే భయాన్ని భూ యజమానులు వదులుకోవాలి. 4. భూ సంస్కరణలకు సంబంధించిన సిఫారుసులు: భూ సం స్కరణలకు సంబంధించి అనేక చట్టాలున్నప్పటికీ వాటిలోని లొ సుగులను అనుకూలంగా మలచుకొని భూస్వాములు సీలింగ్ భూములను అనుభవిస్తున్న దృష్ట్యా వేలాది ఎకరాలు పంపిణీ కాకుండా ఉండిపోయాయి. ప్రభుత్వ భూములను పంచినట్టే సీ లింగ్ భూములను కూడా ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితం గా పంపిణీ చేయాలి. సీలింగ్ భూములు పంపిణీ చేసేప్పుడు మొదటగా ఒక్క సెంట్‌భూమి లేని పేదలకు ప్రాధాన్యతనివ్వా లి. అటువంటి వ్యక్తి ఆ గ్రామంలో అందుబాటులో లేనట్టయి తే, ఒక ఎకరం మాగాణి లేదా రెండు ఎకరాల మెట్ట మించని వారిని భూమిలేని పేదవారిగా గుర్తించాలి. సీలింగ్ కేసుల పరి ష్కారం కోసం ప్రత్యేక బెంచిని ఏర్పాటు చేయాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరాలని కమిటీ సూచన చేయటం విశేషం. 5. నివేశన స్థలాలకు సంబంధించిన సిఫారసులు: భూమిలేని పేద లు, వృతిదారులు, వ్యవసాయ కార్మికులు ఆక్రమించుకున్న ఇళ్ల స్థలాలు, ఇళ్ళ నిర్మాణం చేసుకున్నవారి నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా అన్ని హక్కులు కల్పించాలి. నివేశనా స్థలాల చట్టం యొక్క లాభాలను గురించి పేదలకు అవగాహన కల్పించాలి. 6. భూమి రికార్డులకు సంబంధించిన సిఫారసులు: భూ రికార్డులు సమగ్రంగానూ, సరిగాను లేక పోవటం వలన అనేక భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నా యని, భూ సంబంధిత సమస్యలన్నింటినీ ఒకేచోట పరిష్క రించేందుకు వీలుగా ఒకే సమీకృత భూసమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి, దాని నిర్వహణా బాధ్యతను అంకిత భావం కలి గిన శాఖకు అప్పగించాలి. 7. దేవాలయ, ఇనాం భూములు: ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ప్రతి దేవాలయానికి ఉన్న భూములను సవిరంగా, సమగ్రంగా నమోదు చేయాలి. ధనికులు దేవాలయ భూములను ఆక్రమించుకుంటే వారిని తొలగిం చాలి. దేవాల యాలకు తగు మొత్తంలో ఆదాయాలు వచ్చేటట్టు చర్యలు చేపట్టాలి. ఇనాం భూములకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి సర్టిఫికెట్ మంజూరు చేయాలి. 8. గిరిజన భూసమస్యలు: గిరిజన భూములు గిరిజనేతరులకు భారీ స్థాయిలో అన్యాక్రాంతమయ్యాయి.

అన్యాక్రాంతమైన గిరిజన భూ ములు తిరిగి గిరిజనులకు లభించేలా, ఆ భూములకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. గిరిజనేతరులు యిచ్చే రాతపూర్వక సాక్ష్యాల కన్నా, గిరిజనులు యిచ్చే మౌఖిక సాక్ష్యానికే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. ప్రజా నివాసం లేనిచోట గిరిజనులు మాత్రమే సాగుచేసుకోవాలి. నిబద్ధత గల యువ అధికారులను గిరిజన ప్రాంతాలలో అధి కారిగా నియమించాలి. ఇలా 104 సిఫారసులను కమిటీ సూచిం చటం పేర్కొన దగ్గ విషయం. ఇందులో అనేక అంశాలు పేద లకు అనుకూ లంగా ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో ఈ కమిటీ సిఫార సులకు అప్పట్లోనే ఎంతో ప్రాధాన్యత వచ్చింది. ప్రభు త్వం చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందు కు సాగినట్లయితే భూ సమస్యలు లేని రాష్ట్రంగా రూపుది ద్దుకునే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. మరి ఈ కమిటీ సిఫారసులు ఏమయ్యాయి? ఎందుకు బుట్టదాఖలయ్యా యి? ఒక ప్రభుత్వం చేపట్టిన మంచి పనిని తరువాయి ప్రభుత్వం కొనసాగించదా? భూ పంపిణీ రపహసనం పుటలో కోనేరు కమిటీ పేజీ కూడా చేరాల్సిందేనా!
 పోతుల బాలకోటయ్య
98497 92124

Tags
English Title
'Koneru' recommendations are 'Mae'!
Related News