మోదీ, అమిత్ షాతో కృష్ణంరాజు భేటీ

Updated By ManamWed, 08/01/2018 - 17:59
krishnam raju
krishnam raju

న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై కీలకంగా చర్చించారు. అలాగే  ఏపీలో రాజకీయ పరిణామాలు, వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలు  తదితర అంశాలపై ప్రత్యేకంగా తయారు చేయించిన నివేదిక సమర్పించారు.

కాగా గత కొంతకాలంగా కృష్ణంరాజు  క్రియశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఈ నేపధ్యంలో ప్రధాని, పార్టీ అధ్యక్షుడితో కృష్ణంరాజు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

English Title
Krishnam Raju Met narendra modi, amit shah
Related News