కోదండరాంతో శిఖండి రాజకీయాలు

Updated By ManamMon, 12/04/2017 - 17:05
Jithendar Reddy

ktrమహబూబ్‌నగర్: విపక్షాలు, జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకపడ్డారు. టీఆర్ఎస్‌కు ప్రజలు 60 మాసాల అధికారం ఇచ్చారని..ఆ పదవీకాలం ముగిసేలోపు లక్ష కాదు లక్షా పన్నెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నారు. కొంత మంది ప్రతిపక్ష నాయకులు ఓ రిటైర్డు ప్రొఫెసర్‌ను పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధినేత్రి 
సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని మర్యాదగా ఇవ్వలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితిని తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 

ktrకేసీఆర్ పాలమూరు ఎంపీగా చెప్పిన వాగ్దానాలన్నీ అమలుచేస్తున్నట్లు తెలిపారు. పాలమూరు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న జిల్లాగా పేర్కొన్నారు. యాభై ఏళ్ళు ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు అధికారమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ఈరోజు మాట్లాడుతున్న నాయకులు.. ఉద్యమ సమయంలో ఏనాడైనా కలిసి వచ్చారా? అని ప్రశ్నించారు. కొలువులకై కొట్లాట.. మీ పదవుల కొలువుల కోసమేనని విపక్ష నేతల తీరుపై ధ్వజమెత్తారు. 

ktr1953 నుంచి 2014 దాకా తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. ముసలి కన్నీరు కార్చే ముసలి నక్కల్లాంటి వారు కాంగ్రెస్ నాయకులన్నారు. తమకు బాస్‌లు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు తప్ప.. డిల్లీ,అమరావతిలో లేరన్నారు.
 త్వరలో భూత్పూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్‌లను కలుపుతూ గ్రోత్ క్యారిడర్ ఏర్పాటు చేస్తామన్నారు.  మహబూబ్ నగర్ జర్నలిస్టులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

English Title
KTR Fires on opposition
Related News